
President plane : అది అద్యక్షుడి విమానం. విమానంలో ఆయన లేరు. కానీ విమానం మాత్రం గాల్లో చక్కర్లు కొట్టింది. చక్కర్లు కొడితే ఫర్వాలేదు. ఫీట్లు చేశారు. పైలెట్ల అత్యుత్సాహంతో పెను ప్రమాదం తప్పింది. విమానం ఒక పక్కకు ఒరిగిపోయి భూమిని తాకేందుకు రావడం సంచలనం కలిగించింది. దీంతో స్థానికులు గమనించి దాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో పెద్ద సంచలనం అయింది.
లక్ ఏంటంటే ఆ సమయంలో అధ్యక్షుడు అందులో లేకపోవడమే. అర్జెంటీనా రాజధాని బ్యూకస్ లో ఎయిర్స్ లోని విమానాశ్రయంలో ఈ ఘటన జరిగింది. విమానం ఎడమ వైపు మలుపు తిరిగే ముందు పట్టు తప్పింది. భూమికి అత్యంత సమీపానికి రావడంతో అందరు ఆందోళనకు గురయ్యారు. ప్రత్యక్షంగా చూసిన చాలా మంది భయపడ్డారు.
విమానం ఒక వైపు ఒరిగిపోయినట్లు కనిపించింది. అర్జెంటీనా అధ్యక్షుడి కొత్త విమానం చివరి క్షణంలో తనను తాను అద్భుతంగా రక్షించుకుంది అని ఓ నెటిజన్ ఆసక్తికర కామెంట్ చేశాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. బాధ్యతారాహిత్యానికి ఇది పరాకాష్ట అని ట్వీట్లు పెడుతున్నారు. ఏదైనా జరిగి ఉంటే ఎలా అని ప్రశ్నిస్తున్నారు.
ఏంట్రా బాబూ ఇది అని ఆశ్చర్యపోతున్నారు. అధ్యక్షుడి విమానాన్ని ఇలా తిప్పడం ఏమిటని అడుగుతున్నారు. ఏదైనా జరిగితే ఎవరు బాధ్యులు అని మండిపడుతున్నారు. గాల్లో ఉండే విమానంతో ఆటలు ఆడితే గాల్లోనే కలుస్తాం. బతుకుతోని ఆటలొద్దని హితవు పలుకుతున్నారు. ఆకాశంలో ఆటలు ఆడితే అటే పోవాల్సి వస్తుంది.
🚨🇦🇷 Argentina’s new presidential plane, the 757, elegantly saves itself at the last moment.#UkraineWar #Russia #messi pic.twitter.com/rMZ1trRHlE
— Eren 𝕮🇹🇷 (@Eren50855570) May 26, 2023