Parliament : పార్లమెంట్ లో ఓ సీటును దాచేశారు. భారతీయులు ఎవరికీ తెలియని విషయం ఇదీ. కొత్త లోక్ సభలో మొత్తం 545 ఎంపీ సీట్లు ఉంటాయి. 1వ నంబర్ సీటు నుంచి 545 వరకూ ఎంపీ సీట్లను వరుసగా అమర్చారు. అయితే ఇందులో ఒక సీటును దాచేశారు. లేకుండా చేశారు అదో మిస్టరీ.. ఏంటో తెలుసుకుందాం.
లోక్ సభలో 540 సీట్లలో 420 సీటు అనేది ఎవరికీ కేటాయించలేదు. అసలు ఆ సీటును కేటాయించలేదు. మరి ఎలా అక్కడ ఎంపీని అమర్చారని చూస్తే.. మన పాత ఇండియన్ పీనల్ కోడ్ (ఐపీసీ) సెక్షన్ 420 ప్రకారం మోసం, దగా చేసిన వారిని 420 అని పిలుస్తుంటారు. 420 నంబర్ కు సమాజంలో అదొక అపప్రద ఉంది. అందుకే ఆ సీటును కేటాయిస్తే ఆ ఎంపీకి అవమానం అని పార్లమెంట్ లో ఆ సీటునే లేకుండా చేశారు.
420 సీటుకు బదులుగా 419 సీటు తర్వాత 419A, 419 B అంటూ ఈ నంబర్ పై రెండు సీట్లను ఏర్పాటు చేశారు. ఎవరికీ 420 సీటును కేటాయించకుండా ఇలా సర్దుబాటు చేశారు. అలా ఎవరి మనోభావాలు దెబ్బతినకుండా ఇలా చేశారు.