Hindupuram YCP New Demand :
ఉమ్మడి అనంతపురం జిల్లా ప్రస్తుత సత్య స్థాయి జిల్లాలో హిందూపురం ఎమ్మెల్యే ఎవరంటే ఠక్కున చెప్పేస్తారు నందమూరి బాలకృష్ణ అని. 1983 లో హిందూపురం లో అన్న ఎన్టీఆర్ గెలిచారు. ఇక ఆ తర్వాత ఇక్కడ టీడీపీదే గెలుపు.
గతంలో హరికృష్ణ కూడా ఇక్కడి నుంచి శాసన సభ్యుడిగా గెలిచారు. గత 2014, 2019 రెండు పర్యాయాలు బాలకృష్ణ ఇక్కడి నుంచి విజయం సాధించారు. హిందూపురంలో నందమూరి కుటుంబానికి అభిమానులెక్కువ.
అయితే బాలకృష్ణ ఎమ్మెల్యే అయ్యాక ఈ ప్రాంత అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టారు. టీడీపీకి కంచుకోటగా ఉన్న ఈ నియోజకవర్గం పై ప్రస్తుతం వైసీపీ దృష్టి పెట్టింది. ఎలాగైనా ఇక్కడ గెలిచి తీరాలని చూస్తున్నది. వైసీపీ నియోజకవర్గ ఇన్చార్జిగా దీపికను ఇటీవలే సీఎం జగన్ నియమించారు.
అయితే తాజాగా అనూహ్య డిమాండ్ హిందూపురం నుంచి వస్తున్నది. ఇక్కడి వైసీపీ శ్రేణులు హిందూపురం నుంచి జగన్ లేదా అతడి కుటుంబ సభ్యుల పోటీచేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇందుకు అనుగుణంగా హిందూపురం లో భారీ ర్యాలీ తాజాగా చేశారు. జగనన్న రావాలి.. జగనన్న కావాలి అంటూ ఫ్లకార్డులతో భారీ ఎత్తు న వైసీపీ శ్రేణులు ర్యాలీ తీశారు.
ఇక్కడ ఎమ్మెల్యే బాలకృష్ణ కు చెక్ పెట్టాలని వైసీపీ నేతలు భావిస్తున్నారు. సీఎం జగనే రంగంలోకి దిగితే కొంత మార్పు సాధ్యమవుతుందని భావిస్తున్నారు. అయితే మరికొందరు దీనిని కొట్టిపడేస్తున్నారు. నియోజకవర్గం ఇన్చార్జిగా దీపిక ను నియమించడం ఇష్టం లేని వారంతా ఈ డిమాండ్ ను తెరపైకి తెచ్చినట్లు తెలుస్తున్నది.
పులివెందుల అసెంబ్లీ జగన్ కుటుంబానికి పెట్టని కోట. దానిని వదిలి ఆయన రారు. అలాంటి సందర్భంలో ఆయన కుటుంబంలో ఎవరో ఒకరు ఇక్కడి నుంచి పోటీ చేయాలని సదరు నేతలు కోరుతున్నారు.
మరి టీడీపీకి కంచుకోటగా ఉన్న హిందూపురం 2024 ఎన్నికల్లో చేజారుతుందా.. లేదంటే మరోసారి పసుపు జెండా ఎగురుతుందా అంటే ఎన్నికల వరకు వేచి చూడాల్సిందే. ఇప్పటివరకైతే ఇక్కడ టీడీపీ కి బలమైన క్యాడర్ ఉంది. క్షేత్రస్థాయిలో కూడా మంచి నేతలు ఉన్నారు. అయితే ఒక్క ఎమ్మెల్యేగా స్థానికంగా ఉండరు… అన్న మాట తప్ప..
అభివృద్ధి పనులు మాత్రం కొనసాగుతూనే ఉన్నాయి. కొన్ని సందర్భాల్లో ఎమ్మెల్యే బాలకృష్ణ తన సొంత సొమ్ముతో పనులు చేయించారనే పేరు కూడా ఉంది. అయితే వైసీపీ ప్రభుత్వం వచ్చాక హిందూపురానికి నిధుల విడుదల తగ్గిందని స్థానిక టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. మరి ఇక్కడి వైసీపీ నేతల డిమాండ్ ను జగన్ పట్టించుకుంటారో.. లేదో చూడాలి.
ReplyForward
|