Tea Plant :
మనదేశంలో టీ తాగని వారుండరంటే అతిశయోక్తి కాదు. టీ మనకు అలవాటు చేసింది ఆంగ్లేయులు. కానీ టీ పుట్టుక కారణాలు వేరే ఉన్నాయి. టీ ఆకులు బుద్ధుడి కనుబొమ్మల నుంచి పుట్టాయని కొందరి వాదన. కానీ ఇవి చైనాలో ఉద్భవించాయని అక్కడి వారి నమ్మకం. దయ అనే దేవత కరుణతో తేయాకు మొక్కలు పుట్టాయని చెబుతుంటారు. చైనాలో ఓ కథ ప్రచారంలో ఉంది.
బోధిసత్వుడు దీనికి ప్రత్యక్ష సాక్షిగా నిలిచాడని భావిస్తుంటారు. చైనాలోని ఒక ప్రాంతంలో బోధిసత్వుడి కంచు విగ్రహం ప్రతిష్టించి ఉన్న పురాతన ఆలయం ఉండేది. ఓ నిరుపేద రైతు రోజు వచ్చి ఆ గుడిని శుభ్రం చేసేవాడు. ఒక రోజు అనుకోకుండా బోధిసత్వుడి విగ్రహం కదిలింది. దాన్ని చూడగానే రైతు మోకరిల్లి కళ్లు మూసుకోగా దయా దేవి నీ భవిష్యత్ కు వెలుపల తాళం చెవి ఉంది. జాగ్రత్తగా కాపాడుకో అని చెప్పిందట.
ఆ రైతు ఆశ్చర్యపోయాడు. తరువాత గుడి బయట వెతకగా ఓ ఎండిపోయిన పొద కనిపించింది. దానికి పాదు తీసి రోజు నీళ్లు పోస్తూ జాగ్రత్త పడ్డాడు. కొన్నాళ్లకు పొద చిగురించి పచ్చగా మారింది. దాని ఆకులు సేకరించి పానీయంగా తాగితే ఎక్కడ లేని ఉత్సాహం కలిగింది. దీంతో దాని ఆకును టీ చేసుకుని తాగడం అలవాటు చేసుకున్నారు.
దయ దేవత వల్లే తేయాకు ఉనికిలోకి వచ్చింది. దయ గల దేవత సెలవిచ్చినట్లు చిక్కటి టీ తాగడం వల్ల ఉల్లాసం కలిగిందట. టీ పుట్టుకకు బోధిసత్వుడే కారణమని తెలుసుకున్నారు. అప్పటి నుంచి టీ తాగడం ఓ అలవాటుగా మారింది. తేనీటి తాళం చెవి ఆలోచనల గవాక్షం తెరిచి మస్తిష్కాన్ని తట్టి లేపుతుంది. ఇలా టీ అలవాటు వచ్చిందని నమ్ముతుంటారు.