History our Chandrababu : పరిచయం అక్కర్లేని ప్రజా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు. ఆయన ప్రయాణం అద్వితీయం, అమోఘం చరిత్రలో చిరకాలం నిలిచిపోయే నేతలు, మహోన్నతల పక్కన కూర్చునే అర్హత ఆయన ఎప్పుడో సంపాదించుకున్నారు. రాజకీయంలోకి వచ్చినప్పటి నుంచి ఆయన ఎన్నో అద్భుతాలు సృష్టిస్తూనే ఉన్నారు. ఎమ్మెల్యేగా గెలుపొందిన ఆయన ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ పగ్గాలు చేపట్టి రాష్ట్రాన్ని (ఉమ్మడి ఆంధ్రప్రదేశ్) ప్రపంచ యవనికపై తలెత్తుకొని నిలిచేలా చేశారు.
ఒక్కో మెట్టు అధిరోహిస్తూ రాష్ట్రాన్ని దేశంలోనే కాకుండా ప్రపంచం యావత్తు గుర్తుంచుకునేలా తీర్చిదిద్దారు. ఆయన ఇప్పటి వరకు కలవని దేశ అగ్రనాయకులు గానీ, ప్రపంచంలోని అగ్రనాయకులు గానీ లేరంటే అతిశయోక్తి కాదు. ఆయన తెలుగుదేశం పార్టీని టేకోవర్ చేసినప్పటి నుంచి ఉమ్మడి రాష్ట్రంలో ఎన్నో కార్యక్రమాలు నిర్వహించారు. అప్పటి ఉమ్మడి రాష్ట్ర రాజధాని హైదరాబాద్ కు అప్పటి అమెరికా ప్రెసిడెంట్ బిల్ గేట్స్ ను తీసుకువచ్చారు. ఐటీ హబ్ ఏర్పాటు చేసి హైటెక్ సిటీ నిర్మించారు.
రాష్ట్రపతుల నుంచి ప్రధానుల వరకు ఎంతో మందితో సన్నిహిత సంబంధాలు నెలకొల్పారు చంద్రబాబు నాయుడు. ఇటు దేశంలోని ప్రభుత్వాధి నేతలను కలుస్తూనే.. అటు టెక్ మేధావులు సత్యనాదెళ్ల లాంటి వారిని కూడా కలుస్తూ రాష్ట్రానికి భారీ ప్రాజెక్టులు తీసుకువచ్చేలా కష్టపడ్డారు. తన, పర భేదాలు మాని రాష్ట్ర ప్రయోజనాల కోసం నిత్యం పరితమించేవారు. కేంద్రంలో ప్రత్యర్థి పార్టీ (కాంగ్రెస్) అధికారంలో ఉన్నా వారితో కోట్లాడి రాష్ట్ర ప్రయోజనాలు నెరవేర్చుకున్నారు. ఆయన చిరకాల ప్రయాణానికి సంబంధించి కొన్ని పిక్ లు జేఎస్‌డబ్ల్యూ వ్యూవర్స్ కోసం..