HIV needle : సినిమా హాళ్లు, మాల్స్ వద్ద వెహికిల్స్ అందులో టూ వీలర్స్ పార్కింగ్ చేసే సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలని ఒక పోస్ట్ ఇన్ స్టాలో వైరల్ గా మారింది. దీని అర్థం ఏంటంటే? సినిమా హాళ్లు, మాల్స్ వద్ద ఉన్న బైకులపై సైకోగాళ్లు హెచ్ఐవీ సోకిన వ్యక్తి బ్లడ్ తో కూడిన నిడిల్ పెడుతున్నారట. అనుకోకుండా సీటుపై కూర్చుంటే నీడిల్ బాడీలోకి వెళ్లి వైరస్ వ్యాపించే అవకాశం ఉందని హెచ్చరికతో కూడిన పోస్ట్ ఇది. మీరు మీ బైక్ పై ప్రయాణం చేసే సమయంలో ఫస్ట్ సున్నీతంగా తాకి చూడాలని ఇలాంటి నీడిల్స్ ఉంటే తొలగించుకోవాలని ఈ పోస్ట్ అర్థం. అయితే ఈ పోస్ట్ చూసిన కొందరు మాత్రం ఈ పోస్ట్ చేసిన అడ్మిన్ పై విరుచుకుపడుతున్నారు. ఎందుకంటే హెచ్ఐవీ వైరస్ బయట ఐదు సెకండ్ల కంటే ఎక్కువ సేపు బతకదని, వేగంగా నశిస్తుందని అందుకే ఈ పోస్ట్ తప్పని సూచిస్తున్నారు. అయితే సైకోగాళ్లు మాత్రం నీడిల్స్ సీటు పై ఉంచడం జరుగవచ్చని, అది వారి సైకోయిజం అని, దీని విషయంలో జాగ్రత్తలు అవసరమే కానీ. ఏదో నిడిల్ గుచ్చినంత మాత్రాన ఎయిడ్స్ వస్తుందని భయాందోళన చెందాల్సిన అవసరం లేదని కొందరుకామెంట్లు పెడుతున్నారు.
Breaking News