Artificial Intelligence Effect :
మానవాళి మనుగడలో ప్రస్తుతం రోబోలు కూడా భాగంగా మారాయి. మనుషులు వెళ్లలేని ప్రదేశాలకు వెళ్లడం, మనుషులు చేయలేని పనులు చేయడానికి రోబోలను సృష్టించారు సైంటిస్టులు. కానీ ప్రస్తుతం అవి మనుషుల దైనందన జీవనంలో భాగమయ్యాయి. దీంతో మానవాళికి శారీరక శ్రమ తగ్గింది. ఇంత వరకు ఓకే.. కానీ ఈ రోబోలు, ఈ టెక్నాలజీ మరింత ముందుకు వెళ్తే.. మానవాళి మనుగడ కష్టమే. రోబోలు పెరుగుతుండడం వాటితో మనిషికి నిత్యం పని ఉండడం మన చూస్తూనే ఉన్నాం.
మనిషి జీవితంలో రోబోల పాత్రపై పాజిటివ్ నుంచి నెగెటివ్ వరకు చాలా సినిమాలు తీశారు హాలీవుడ్ దర్శకులు. అయితే, ఇప్పుడు అదే హాలీవుడ్ నే శాసిస్తుంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, చాట్ జీటీపీ. ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు కథల కోసం రైటర్స్ ను ఆశ్రయిస్తారు. అలా సేకరించిన కథలను పరిశీలించి ఒక సినిమా రూపుదిద్దుకుంటుంది. హాలీవుడ్ లో ఎంతో మంది టాప్ స్టార్ రైటర్స్ ఉన్నారు. ప్రస్తుతం వీరంతా ‘పెన్ డౌన్’ చేస్తున్నారు. ఎందుకంటే వీరికి వృత్తిని కూడా దెబ్బ కొడుతుంది చాట్ జీపీటీ.
చాట్ జీపీటీ, ఏఐ వచ్చిన తర్వాత చాలా రంగాల్లో ఉపాధి అవకాశాలు తగ్గిపోయాయి. ఇప్పటికే కర్మాగారాల్లో యంత్రాల రూపంలో రోబోలు రావడంతో చాలా మంది కార్మికులు రోడ్డున పడ్డారు. ఇక ఏఐ ప్రవేశించి మెల్ల మెల్లగా సాఫ్ట్ వేర్, మీడియా ఇలా చాలా రంగాల్లో ఉపాధిని పూర్తిగా దెబ్బతీస్తుంది.
‘పెన్ డౌన్’కు చాట్ జీపీటీకి సంబంధం ఏంటని అనుకుంటున్నారా.. అయితే ఒక డైరెక్టర్ కథ కావాలంటే రైటర్ వద్దకు వెళ్లాలి. కానీ ఇక్కడ కథను చాట్ జీపీటి ఇస్తుంది. డైరెక్టర్ కు ఏఏ కంటెంట్ తో స్టోరీ కావాలో జస్ట్ బటన్ క్లిక్ చేస్తే చాలు పూర్తిగా అదే ఇస్తుంది. దీని వల్ల హాలీవులో రైటర్లకు చోటు లేకుండా పోతోంది. చాట్ జీపీటీ ఉపయోగించవద్దని నిరసనగా వారు పెన్ డౌన్ చేశారు. దీంతో హాలీవుడ్ లో సినిమాలు రావడం కూడా ఆగిపోయాయి. ఇక ఇండియా నుంచి చాలా దేశాల వరకు వీఎఫ్ఎక్స్ రంగంలో సదరు కంపెనీలు ఎంప్లాయిస్ ను తొలగిస్తున్నాయి.
మనిషి మేథస్సును మించిన మిషన్ ఇప్పటి వరకు రాలేదని కొందరు విశ్లేషకులు చెప్తున్నారు. చాట్ జీపీటీలో కొంత కాలానికి సంబంధించిన సమాచారం మాత్రమే ఫీడ్ చేసి ఉందని, అది ప్రస్తుత సమాచారం ఇవ్వలేదని చెప్తున్నారు. దీని వల్ల ఏఏ రంగాలు ప్రభావితం అయినా రైటర్స్ కు మాత్రం ఎటువంటి ఢోకా లేదని చెప్తున్నారు.