
Honey Rose : ఈ మధ్య కాలంలో సౌత్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయిన నటీమణుల్లో హానీ రోజ్ ఒకరు.. ఈమె సోషల్ మీడియాను వేదికగా చేసుకుని ప్రతీ నిత్యం గ్లామరస్ ఫొటోలతో కుర్రాళ్లను కట్టి పడేస్తుంది. మొన్నటి వరకు ఈమె ఎవరో కూడా తెలియని వారికీ ఇప్పుడు ఫేవరేట్ యాక్ట్రెస్ అయిపొయింది..
ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టి ఎంతో కాలం అవుతున్న ఈ మధ్యనే భారీ స్థాయిలో క్రేజ్ తెచ్చుకుంది.. ఎప్పటి కప్పుడు తన ఘాటైన అందాలను మరింత ఘాటుగా ప్రదర్శిస్తూ రచ్చ రచ్చ చేస్తుంది ఈ కేరళ కుట్టీ.. ఈమెకు నటన, డ్యాన్స్ మీద ఉన్న మక్కువతో చదువు పూర్తి అయిన తర్వాత 2005లో మలయాళ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది.
అప్పటి నుండి అన్ని బాషలలో నటిస్తూ సౌత్ ఇండియాలో ఫేమస్ అయ్యింది. అయితే తెలుగులో మాత్రం ఈమె ఈ మధ్యనే ఫేమస్ అయ్యింది అనే చెప్పాలి.. బాలయ్య హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన వీరసింహారెడ్డి సినిమాలో బాలయ్య సరసన నటించి మెస్మరైజ్ చేసిన ఈ బ్యూటీ ఇప్పుడు తెలుగులో చాల ఫేమస్ అయిపోయింది.
మలయాళ ఇండస్ట్రీలో సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా ఎదిగిన ఈ బ్యూటీ మమ్ముట్టి, మోహన్ లాల్ వంటి స్టార్స్ తో నటించింది.. ఇక ఇప్పుడు తెలుగులో కూడా క్రేజ్ పెంచుకుంటున్న నేపథ్యంలో ఇక్కడ కూడా అవకాశాలు వరించే అవకాశం కనిపిస్తుంది. ఇది పక్కన పెడితే ఈమె సోషల్ మీడియాలో మరోసారి ఘాటు అందాలను షేర్ చేసింది. బ్లాక్ శారీలో మతిపోగోట్టే రీతిలో ఈమె ఎక్పోజింగ్ ఉంది. స్విమ్మింగ్ ఫూల్ లో కూర్చుని వయ్యారంగా నడుము అందాలను చూపిస్తున్న ఈ బ్యూటీ లేటెస్ట్ పిక్స్ మీరు కూడా చూసేయండి..
View this post on Instagram