Horoscope today: మేష రాశి వారికి పనుల్లో ఆటంకాలు లేకుండా చూసుకోవాలి. ఒత్తిడి పెరిగినా తట్టుకోవాలి. బంధుమిత్రులతో చనువుగా ఉండొద్దు. దుర్గాదేవిని ఆరాధించడం వల్ల శుభాలు కలుగుతాయి.
వ్రషభ రాశి వారికి మంచి కాలం. సమస్యలు పరిష్కారమవుతాయి. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. మానసికోల్లాసం కలుగుతుంది. ఇష్టదేవతారాధన చేయడం మంచిది.
మిథున రాశి వారికి పనికి తగిన గుర్తింపు వస్తుంది. అధికారుల సహాయం దొరుకుతుంది. కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఉమామహేశ్వర స్తోత్రం చదవడం వల్ల మంచి ఫలితాలుంటాయి.
కర్కాటక రాశి వారికి పనుల్లో వేగం ఉంటుంది. కొన్ని నిర్ణయాలు మీకు అనుకూలంగా ఉంటాయి. గతంలో ఆగిపోయిన పనులు మొదలవుతాయి. ఇష్టదేవతారాధన మంచి చేస్తుంది.
సింహ రాశి వారికి ఒక శుభవార్త ఉల్లాసాన్ని కలిగిస్తుంది. కీలక వ్యవహారాల్లో సమయస్ఫూర్తితో వ్యవహరించి విజయాలు అందుకుంటారు. క్రిష్ణాష్టకం చదవడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి.
కన్య రాశి వారికి పనుల్లో ఆటంకాలు రావచ్చు. పెద్దలను కలుసుకుంటారు. కొన్ని నిర్ణయాలు మీకు అనుకూలంగా రాకపోవచ్చు. దత్తాత్రేయ స్తోత్రం చదవడం వల్ల శుభాలు కలుగుతాయి.
తుల రాశి వారికి పనుల్లో వేగం పెరుగుతుంది. మీ శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. ఆధ్యాత్మికత ఇనుమడిస్తుంది. ప్రయాణాల్లో మేలు కలుగుతుంది. శివస్తోత్రం చదవడం వల్ల ఇంకా మంచి ఫలితాలొస్తాయి.
వ్రశ్చిక రాశి వారికి ఒక వార్త సంతోషం కలిగిస్తుంది. కీలక బాధ్యతలు నిర్వహిస్తారు. అందరి ప్రశంసలు దక్కుతాయి. విందు, వినోదాల్లో పాల్గొంటారు. శివారాధన చేయడం మంచిది.
ధనస్సు రాశి వారికి అనుకూల కాలం. ఉత్సాహంతో పనిచేస్తారు. బంధువులతో జాగ్రత్తగా ఉండాలి. పంచముఖ ఆంజనేయుడిని ఆరాధించడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి.
మకర రాశి వారికి పనికి తగిన గుర్తింపు వస్తుంది. ధైర్యంతో ముందుకు వెళితే మంచి ఫలితాలు ఉంటాయి. సహనంతో వ్యవహరించాలి. విష్ణు ఆరాధన చేస్తే శుభం కలుగుతుంది.
కుంభ రాశి వారికి శ్రమకు తగిన ప్రతిఫలం దక్కుతుంది. అలసట ఉన్నా ఆగకూడదు. పనులు త్వరగా పూర్తి చేసుకోవచ్చు. వెంకటేశ్వర స్వామిని ఆరాధిస్తే మంచిది.
మీన రాశి వారికి ఉద్యోగ వ్యాపారాల్లో బాగుంటుంది. వినోదాల్లో పాల్గొంటారు. ఒక వార్త మీలో సంతోషాన్ని నింపుతుంది. దైవారాధన చేస్తే ఇంకా మంచి ఫలితాలు వస్తాయి.