horoscope today మేష రాశి వారికి ఆలోచన విధానం బాగుంది. కొత్త పనులు ప్రారంభిస్తారు. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. లక్ష్మీదేవిని ఆరాధించడం వల్ల మంచి ఫలితాలుంటాయి.
వ్రషభ రాశి వారికి పనుల్లో ఆటంకాలు ఎదురైనా అధిగమిస్తారు. కోపాన్ని తగ్గించుకుంటేనే లాభం. గోసేవ చేసుకుంటే మంచి ఫలితాలు వస్తాయి.
మిథున రాశి వారికి అనవసర ఖర్చులున్నాయి. విభేదాలు పెరుగుతాయి. ఆధ్యాత్మికంగా చురుకుగా ఉంటారు. ఇష్ట దేవత స్తోత్రం పారాయణం చేస్తే మంచిది.
కర్కాటక రాశి వారికి మీ శ్రమకు తగిన ఫలితాలున్నాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. సుబ్రహ్మణ్య స్వామిని పూజించడం వల్ల మంచి జరుగుతుంది.
సింహరాశి వారికి చేపట్టే పనులు పూర్తవుతాయి. ఆర్థిక విషయాలు ఆందోళన కలిగించకుండా చూసుకోవాలి. శ్రీరామరక్ష కవచం చదివితే మంచిది.
కన్య రాశి వారికి ఒక వార్త మీలో సంతోషాన్ని నింపుతుంది. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఇష్టదేవతను పూజించడం వల్ల మంచి ఫలితాలున్నాయి.
తుల రాశి వారికి బాధ్యతలు పెరుగుతాయి. మీ అంచనాల తలకిందులవుతాయి. విలువైన వస్తువుల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆదిత్య స్తోత్రం చదివితే మంచిది.
వ్రశ్చిక రాశి వారికి చేసే పనుల్లో అనుకూల పరిస్థితులు ఉన్నాయి. కీలక పనులు పూర్తి చేస్తారు. ఆంజనేయ స్వామి స్త్రోత్రం చదవడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి.
ధనస్సు రాశి వారికి భవిష్యత్ ప్రణాళికలు వేస్తారు. మనో ధైర్యంతో ముందడుగు వేస్తారు. ఆంజనేయ స్వామి దర్శనం మంచి ఫలితాలు ఇస్తుంది.
మకర రాశి వారికి శ్రమతో కూడిన ఫలితాలున్నాయి. శ్రమ పెరిగినా విజయం మీదే. వెంకటేశ్వర స్వామిని దర్శించడం వల్ల అనుకూల పరిస్థితులు ఏర్పడతాయి.
కుంభ రాశి వారికి అస్థిరత ఉంటుంది. మనోవిచారం కలిగించే సంఘటనలున్నాయి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధన చేయడం వల్ల మంచి ఫలితాలుంటాయి.
మీన రాశి వారికి అనుకున్న పనులు నెరవేరతాయి. అధికారుల సహకారం ఉంటుంది. ఆర్థిక లాభం కలుగుతుంది. ఇష్టదేవత ఆరాధన మంచిది.