horoscope మేష రాశి వారికి ఉద్యోగ వ్యాపారాల్లో జాగ్రత్తగా ఉండాలి. చేసే పనుల్లో ఆటంకాలు లేకుండా చూసుకోవాలి. బంధువులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. దుర్గాదేవిని కొలవడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి.
వ్రషభ రాశి వారికి చిత్తశుద్ధితో ముందడుగు వేస్తారు. మనోధైర్యం కలిగి ఉంటారు. సమయానుకూలంగా వ్యవహరించాలి. సూర్యుడిని పూజిస్తే మంచి ఫలితాలు వస్తాయి.
మిథున రాశి వారికి పనులు చకచక పూర్తవుతాయి. ఆర్థికంగా ఇబ్బందులుండవు. భవిష్యత్ గురించి ప్రణాళికలు వేసుకుంటారు. శ్రీరామ నామం జపించడం మంచిది.
కర్కాటక రాశి వారికి పనుల్లో పురోగతి ఉంటుంది. వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆర్థిక లాభాలుంటాయి. గణపతిని ఆరాధించడం వల్ల మంచి జరుగుతుంది.
సింహ రాశి వారికి సమస్యలున్నా అధిగమిస్తారు. గోసేవ చేయడం మంచిది. విష్ణు సహస్ర నామాలు పారాయణం చేయడం వల్ల మంచి లాభాలు కలుగుతాయి.
కన్య రాశి వారికి మానసిక ఆనందం కలుగుతుంది. పనుల్లో ఉత్సాహంగా ఉంటారు. అతిగా నమ్మితే నష్టాలు. శ్రీరామ నామాన్ని పఠించడం వల్ల ఉత్తమ ఫలితాలు వస్తాయి.
తుల రాశి వారికి ఆత్మవిశ్వాసం బాగుంటుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో చురుకుగా ఉంటారు. ప్రయాణాల్లో జాగ్రత్తలు పాటించాలి. సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం చదవడం మంచిది.
వ్రశ్చిక రాశి వారికి శారీరక శ్రమ ఉంటుంది. చేసే పనుల్లో జాగ్రత్తలు పాటించాలి. వివాదాల జోలికి వెళ్లకండి. సాయిబాబాను కొలవడం వల్ల మంచి ఫలితాలుంటాయి.
ధనస్సు రాశి వారికి ధర్మబద్ధంగా వ్యవహరించాలి. నిర్ణయాలు తీసుకునేటప్పుడు తొందరపాటు వద్దు. ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. ఆంజనేయ స్వామి స్తోత్రం చదివితే మంచి లాభాలుంటాయి.
మకర రాశి వారికి పనుల్లో పురోగతి ఉంటుంది. అధికారులతో జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. శివస్తోత్రం పఠిస్తే మంచి జరుగుతుంది.
కుంభ రాశి వారికి అధికారులతో అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యమైన పనుల్లో పురోగతి సాధిస్తారు. ప్రయాణాల్లో జాగ్రత్తలు అవసరం. దుర్గ స్తోత్రం చదివితే మంచి ఫలితాలు వస్తాయి.
మీన రాశి వారికి సంతోషకరమైన వార్త వినడం వల్ల ఆనందం కలుగుతుంది. వివాదాలకు వెళ్లొద్దు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శించడం వల్ల సానుకూల ఫలితాలు ఉన్నాయి.