horoscope today : మేష రాశి వారికి మంచి కాలం. గొడవలకు దూరంగా ఉండండి. మంచి ఆలోచనలతో ముందుకు వెళతారు. దత్తాత్రేయ స్వామిని కొలవడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి.
వ్రషభ రాశి వారికి బుద్ధి బలం పెరుగుతుంది. శుభకార్యాల ప్రస్తావన వస్తుంది. భవిష్యత్ ప్రణాళికలు వేస్తారు. వెంకటేశ్వర స్వామిని దర్శించడం వల్ల శుభాలు కలుగుతాయి.
మిథున రాశి వారికి శ్రమ పెరుగుతుంది. సంతోషంగా గడుపుతారు. ఆర్థిక ఇబ్బందులు ఎదురు కావు. దుర్గా స్తోత్రం చదవడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి.
కర్కాటక రాశి వారికి శ్రమ ఎక్కువ అవుతుంది. ఒత్తిడిని జయించాలి. వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. నవగ్రహ శ్లోకాలు చదవడం వల్ల మంచి జరుగుతుంది.
సింహ రాశి వారికి సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఖర్చులు అదుపులో ఉంచుకోవాలి. సూర్యుడిని ఆరాధించడం వల్ల శుభాలు కలుగుతాయి.
కన్య రాశి వారికి ఉత్సాహంగా ముందుకు వెళతారు. ఒక వార్త సంతోషం కలిగిస్తుంది. సూర్య భగవానుడిని పూజిస్తే మంచి ఫలితాలు వస్తాయి.
తుల రాశి వారికి అనుకున్న పనులు పూర్తి చేస్తారు. ఉద్యోగులకు బాగుంటుంది. ఖర్చులు అదుపులో ఉంచుకోవాలి. శ్రమ పెరుగుతుంది. సాయి నామం జపిస్తే మంచిది.
వ్రశ్చిక రాశి వారికి అనుకూలమైన కాలం. బంధు మిత్రులతో చర్చించి నిర్ణయాలు తీసుకుంటే మంచిది. అష్టోత్తర శతనామావళి పారాయణం చేస్తే అనుకూల ఫలితాలు వస్తాయి.
ధనస్సు రాశి వారికి పనుల్లో వేగం పెరుగుతుంది. తెలివితేటలతో పనులు పూర్తి చేస్తారు. ఆంజనేయ స్వామి స్తోత్రం చదివితే మంచి ఫలితాలుంటాయి.
మకర రాశి వారికి శ్రమ పెరిగినా పనులు పూర్తవుతాయి. ఆరోగ్య సమస్యలొస్తాయి. అధికారులతో జాగ్రత్తగా ఉండాలి. శని ధ్యానం చేయడం వల్ల మంచి జరుగుతుంది.
కుంభ రాశి వారికి ఉద్యోగ వ్యాపారాల్లో పురోగతి ఉంటుంది. ఒక వార్త మీకు సంతోషాన్ని కలిగిస్తుంది. కనకధారాస్తవం చదవడం వల్ల అనుకూల ఫలితాలు కలుగుతాయి.
మీన రాశి వారికి మనోధైర్యంతో ముందడుగు వేస్తారు. మీ పని మీరు చేసుకుంటే మంచిది. గణపతిని ఆరాధిస్తే మంచి జరుగుతుంది.