
Horoscope Today: మేష రాశి వారికి విజయాలు దక్కించుకుంటారు. ఇబ్బందులు ఎదురైనా అధిగమిస్తారు. బంధువులతో ప్రేమగా ఉంటారు. ఆంజనేయ స్వామిని దర్శించడం మంచిది.
వ్రషభ రాశి వారికి శ్రమ పెరగకుండా చూసుకోవాలి. శత్రువులు మీపై ఆధిపత్యం చెలాయించాలని చూస్తారు. వివాదాల జోలికి వెళ్లకండి. వెంకటేశ్వర స్వామిని పూజించడం వల్ల మేలు కలుగుతుంది.
మిథున రాశి వారికి ఉద్యోగంలో అప్రమత్తంగా ఉండాలి. ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు పాటించాలి. గొడవలకు పోతే మనకే నష్టం వస్తుంది. వెంకటేశ్వర స్వామిని కొలవడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి.
కర్కాటక రాశి వారికి చేపట్టే పనుల్లో ఆటంకాలు లేకుండా చూసుకోవాలి. కొన్ని సంఘటనలు నిరుత్సాహం కలిగిస్తాయి. కనకధారాస్తవం చేయడం వల్ల మంచి లాభాలున్నాయి.
సింహ రాశి వారికి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ముఖ్యమైన విషయాల్లో ముందుకు వెళతారు. ప్రయాణాల్లో లాభాలున్నాయి. ఇష్టదైవాన్నిప్రార్థిస్తే మంచిది.
కన్య రాశి వారికి శ్రమకు తగిన ఫలితాలుంటాయి. విందు, వినోదాల్లో పాల్గొంటారు. సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. ఈశ్వర ఆరాధన మంచి ఫలితాలు తెస్తుంది.
తుల రాశి వారికి పనుల్లో ఆటంకాలు ఎదురైనా అధిగమిస్తారు. మనోబలంతో ముందుకు వెళ్లాలి. ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు పాటించాలి. శివారాధన చేయడం వల్ల శుభాలు కలుగుతాయి.
వ్రశ్చిక రాశి వారికి మనోధైర్యం పెరుగుతుంది. అనుకూల కాలం. వాగ్వాదాలకు దిగకండి. తప్పుడు నిర్ణయాలు తీసుకోవద్దు. దుర్గాదేవిని ఆరాధిస్తే మేలు కలుగుతుంది.
ధనస్సు రాశి వారికి పనులు త్వరగా పూర్తవుతాయి. ఆర్థిక లాభాలున్నాయి. ఒక పనిలో విజయం సాధిస్తారు. ఇష్టదేవతారాధన మంచి చేస్తుంది.
మకర రాశి వారికి ముఖ్య నిర్ణయాలు తీసుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. ఆరోగ్యంపై శ్రద్ధ ఉండాలి. లక్ష్మిని ఆరాధించడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి.
కుంభ రాశి వారికి ప్రతిభకు తగిన గుర్తింపు ఉంటుంది. ఆర్థిక లాభాలున్నాయి. కలహాలకు దూరంగా ఉండండి. సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించడం మంచిది.
మీన రాశి వారికి మంచి కాలం. మానసికంగా బలంగా ఉంటారు. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఇష్టదేవతను ఆరాధించడం చాలా లాభాలు కలిగిస్తుంది.






