మేష రాశి వారికి పనుల్లో తొందరపాటు వద్దు. నిదానమే ప్రధానం అన్నట్లుగా ఉండాలి. బంధువుల సలహాలు పాటించాలి. ఖర్చులు లేకుండా చూసుకోవాలి. నవగ్రహ ధ్యానం చేస్తే మంచి ఫలితాలుంటాయి.
వృషభ రాశి పనుల్లో పురోగతి ఉంటుంది. ముఖ్యమైన పనుల్లో పురోగతి ఉంటుంది. ఇబ్బందులు రాకుండా చూసుకోవాలి. దుర్గారాధన చేస్తే మంచి జరుగుతుంది.
మిథున రాశి వారికి అవసరానికి డబ్బు చేతికి అందుతుంది. పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. ఇష్టదేవతారాధన చేయడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి.
కర్కాటక రాశి మానసిక బలంతో ఉంటారు. మీకు అడ్డంకులు సృష్టించే వారుంటారు. శివ మహిమ స్తోత్రం చదివితే మంచి ఫలితాలు వస్తాయి.
సింహ రాశి వారికి భవిష్యత్ ప్రణాళికపై దృష్టి పెడతారు. శుభ కార్యాల్లో పాల్గొంటారు. ధర్మంగా ప్రవర్తిస్తారు. ఈశ్వర దర్శనం ఎంతో మంచి కలిగిస్తుంది.
కన్య రాశి వారికి అనుకూలమైన కాలం. విందు వినోదాల్లో పాల్గొంటారు. వృత్తి ఉద్యోగాల్లో బాగుంటుంది. ఆర్థికంగా కలిసొస్తుంది. దైవారాధన చేయడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి.
తుల రాశి వారికి వృత్తి ఉద్యోగాలు అనుకూలంగా ఉన్నాయి. ఆధ్యాత్మికంగా అడుగులు వేస్తారు. బంధువులతో బాగుంటుంది. ఆరోగ్యంపై జాగ్రత్త పెట్టాలి. ఈశ్వరున్ని దర్శిస్తే చాలా మంచి ఫలితాలు వస్తాయి.
వృశ్చిక రాశి వారికి మానసిక ప్రశాంతత ఉంటుంది. ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. ఖర్చులు పెరగకుండా చూసుకుంటే మంచిది. లక్ష్మీ అష్టోత్తర శతనామావళి చదివితే మంచిది.
ధనస్సు రాశి వారికి చేపట్టే పనుల్లో శ్రమ ఎక్కువగా ఉంటుంది. అనారోగ్య సమస్యలు చుట్టుముట్టే అవకాశముంది. శత్రువులతో జాగ్రత్త. ఆంజనేయ స్వామి అష్టోత్తర శతనామావళి చదవడం వల్ల అనుకున్న పనులు పూర్తవుతాయి.
మకర రాశి వారికి పనుల్లో విజయం సాధిస్తారు. ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడతారు. హనుమాన్ చాలీసా చదవడం వల్ల శుభాలు కలుగుతాయి.
కుంభ రాశి వారికి వృత్తి ఉద్యోగాల్లో అనుకూలతలు ఉన్నాయి. చేపట్టిన పనులు పూర్తి చేస్తారు. మానసిక ప్రశాంతత లభిస్తుంది. వెంకటేశ్వర స్వామి సందర్శనం మంచి ఫలితాలు తెస్తుంది.
మీన రాశి వారికి చేపట్టే పనుల్లో ఆటంకాలు ఎదురవుతాయి. అందరి సహకారాలు అందుతాయి. మనోల్లాసం కలుగుతుంది. శివుడిని ఆరాధిస్తే అనుకున్న పనులు నెరవేరతాయి.
ReplyForward
|