Allu Arjun Heroine : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కు జోడీగా ‘సీతారామం’తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన మృణాల్ ఠాకూర్ నటించనున్నట్లు తెలుస్తోంది. అట్లీ తెరకెక్కించే సినిమాలో ఈ ముద్దుగుమ్మ నటిస్తారని సినీ వర్గాలు పేర్కొన్నాయి. దీనిపై మూవీ యూనిట్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. కాగా జూన్ తర్వాత సినిమా షూటింగ్ ప్రారంభం కానుందని సమాచారం. సన్ పిక్చర్స్ ఈ మూవీకి నిర్మాణ సంస్థగా వ్యవహరించనుంది.
Breaking News