Householder commits suicide: కాలం మారింది.. అత్తింటి వేధింపులకు గృహిణి మృతి అన్న వార్తలను ఇన్నాళ్లు చదివిన చాలా మంది ఇప్పుడు గృహస్తుడి మృతి గురించి చదువుతున్నారు. ఆడవారు సూసైడ్ ల నుంచి బయటపడుతున్నారని సంతోషించే లోపే మగవారు ఆత్మహత్యలు చేసుకుంటున్నారన్న వార్తలు విని బాధపడాల్సి వస్తుంది. ఈ రెండింటిలో కూడా అత్తింటి వేధింపులే కారణం కావడం కొసమెరుపు.
భార్య, అత్తమామల వేధింపులు భరించలేక ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన హైదరాబాద్ లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ నెల 2న నగరంలోని కుషాయిగూడ ప్రాంతంలోని తన నివాసంలో వెంకట్ రెడ్డి (38) అనే వ్యక్తి తన భార్య, ఆమె తల్లిదండ్రుల వేధింపులు తాళలేక పురుగుల మందు తాగాడు. జులై 5న ఆస్పత్రిలో కన్నుమూశారు.
వెంకట్ రెడ్డి, కళ్యాణి దంపతులకు ఏడు, రెండున్నర సంవత్సరాల వయసున్న ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. భార్త, అత్తతో ఉంటున్న కళ్యాణికి అత్త ఉండడం నచ్చలేదు. దీంతో ఆమెను మరో చోటికి పంపించాలని ఆమె, ఆమెతో పాటు ఆమె తల్లిదండ్రులు పట్టుబట్టారు. ఈ గొడవ నేపథ్యంలోనే రెండు నెలల క్రితం కళ్యాణి వరంగల్ లోని తన తల్లిదండ్రుల ఇంటికి వెళ్లింది.
ఈ నెల 2న ఆమె తల్లిదండ్రులతో కలిసి వెంకట్ రెడ్డి ఇంటికి వచ్చి గొడవ చేసింది. తల్లితో విడిగా ఉంటూ ఆస్తిని తన ఇద్దరు కూతుళ్ల పేరిట బదలాయించాలని కోరారు. ఇది చుట్టుపక్కల కుటుంబానికి చెడ్డపేరు తెస్తుందని, గట్టిగా మాట్లాడొద్దని కోరారు. వారు వినకపోవడంతో ఇలాగే ప్రవర్తిస్తే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడు. అందుకు కూడా పనికి రావని అత్తింటి వారు మాటలు అనడంతో అవమానంగా భావించిన వెంకట్ రెడ్డి అదే రోజు పురుగుల మందు తాగాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
ReplyForward
|