
Houston NRI Protest : ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టుకు వ్యతిరేకంగా హ్యూస్టన్ నగరంలో ప్రవాస బారతీయులు భారీ ర్యాలీ నిర్వహించారు. నినాదాలతో మూడు గంటల పాటు నిరసన తెలిపి బాబుకు మద్దతుగా తీశారు. హ్యూస్టన్ ఎన్ఆర్ఐ టీడీపీ శాఖ ఆధ్వర్యంలో బాబును విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ నిరసన తెలిపారు.
ఏపీ సీఎం జగన్ నియంత పోకడలకు భారీ మూల్యం చెల్లించుకుంటారని చెబుతున్నారు. మచ్చలేని నేతలను కావాలనే కుట్రలో భాగంగా ఇరికించి నాటకాలు ఆడుతున్నారని మండిపడుతున్నారు. కనీసం పోలీసులు కూడా సరైన సమాధానం చెప్పడం లేదు. కనీసం అరెస్టుకు కారణమైన ఎఫ్ఐఆర్ లో బాబుపేరు కనిపించకపోవడం విడ్డూరమని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
చంద్రబాబు ఉద్దేశపూర్వకంగా అరెస్టు చేసి చేతులు దులుపుకుందామంటే కుదరదు. దీనికి బదులు తీర్చుకుంటాం. మూడు గంటల పాటు నిరసన తెలిపారు. చంద్రబాబును తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు. రాజకీయాలను ఎదుర్కోలేక వ్యక్తిగత కక్షలు తీర్చుకునేందుకు దిగడం జగన్ స్థాయికి తగదు. మరీ దిగజారి పోతున్నారు.
చీప్ రాజకీయాలకు తెర తీస్తున్నారు. సరైన ఆధారాలు లేకున్నా ఇలాంటి తప్పుడు ఆధారాలతో అరెస్టులకు వెళ్లడం బాగాలేదని నిరసించారు. ఇప్పటికే వాషింగ్టన్ లాంటి నగరాల్లో కూడా బాబుకు మద్దతుగా దీక్షలు చేసిన టీడీపీ మద్దతు దారుల ఆగ్రహంతో వైసీపీ నేతలకు ముచ్చెమటలు పడుతున్నాయి. బాబును అరెస్టు చేసినా ఆయనకే ప్లస్ అవుతుందని గుర్తు చేస్తున్నారు.