Manoj-Smita తెలంగాణలో ఈ మధ్య శామీర్ పేట్ కాల్పుల ఘటన సంచలనం రేపింది.. ఈ ఘటనతో తెలంగాణ మొత్తం ఒక్కసారిగా ఉలిక్కి పడింది.. శామీర్ పేట్ ఘటనలో రోజురోజుకూ సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.. యాక్టర్ మనోజ్, స్మితల వ్యవహారంలో మరిన్ని విషయాలు వెలుగులోకి రావడంతో ఈ ఘటన మరింత కలకలం రేపుతోంది.
అయితే యాక్టర్ మనోజ్ అనగానే అందరు కార్తీకదీపం సీరియల్ యాక్టర్ అని అనుకుని అదే వార్త వైరల్ అయ్యింది. ఈ విషయం అతడి వద్దకు చేరడంతో తనకు ఎలాంటి సంబంధం లేడనై తాను హైదరాబాద్ లోనే లేనని చెప్పుకొచ్చాడు. మరి మనోజ్ ఎవరు ఆ స్టోరీ గురించి తెలుసుకుందాం..
పోలీసులు కోర్టుకు సమర్పించిన రిపోర్ట్ ప్రకారం.. సిద్ధార్థ్ దాస్ తో స్మితో 2003లో పెళ్లి జరుగగా వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. వీరిద్దరి మధ్య విభేదాలు తలెత్తాయి. 2018లో స్మిత సిద్ధార్థ్ పై గృహహింస కేసు నమోదు చేసి ఆ తర్వాత విడాకులు కూడా అప్లై చేశారట.. అప్పటి నుండి భర్తతో వేరుగా ఉంటున్న స్మితకు ఫేస్ బుక్ లో యాక్టర్ మనోజ్ పరిచయం అయ్యాడు. ఈ పరిచయం కాస్త సహజీవనం వరకు వచ్చింది.
గత 3 ఏళ్లుగా స్మిత పిల్లలతో కలిసి మనోజ్ తో ఉంటుంది. అయితే మనోజ్ తమను వేధిస్తున్నాడని స్మిత కుమారుడు కంప్లైంట్ చేయగా సీడబ్ల్యూసీ వాళ్ళు సిద్ధార్థ్ ను పిలిపించారు.. సిద్ధార్థ్ దాస్ పిల్లల కోసం సెలెబ్రిటీ విల్లాకు వెళ్లగా మనోజ్ ఎయిర్ గన్ తో సిద్ధార్థ్ మీద కాల్పులు జరిపాడు.. గన్ చూసి భయపడిన సిద్ధార్థ్ పోలీసులకు కంప్లైంట్ చేయడంతో మనోజ్ ను అరెస్ట్ చేసి ఎయిర్ గన్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇది వీరి విషయంలో జరిగిన మ్యాటర్..