Bhavana Lasya : ఇప్పుడు వస్తున్న సీరియల్స్‌లో చాలా మంది హీరోయిన్స్ ఉంటున్నారు. కానీ వాళ్ళలో చాలా మంది ఇతర భాషా ఇండస్ట్రీలకు చెందినవారు. అందులో కూడా ఎక్కువగా కన్నడ వారు ఉంటున్నారు. కొంత మంది తమిళ్, మలయాళంకు చెందిన వారు ఉంటున్నారు. తెలుగు డబ్బింగ్ చెప్పించి సీరియల్స్ లో వారికి అవకాశం ఇస్తున్నారు.
తెలుగు వారికి అవకాశాలు ఎందుకు ఎక్కువగా రావు అని అనుకుంటుంటారు. ఇంత మంది ఇతర భాషల హీరోయిన్ల మధ్యలో ఇప్పుడు తెలుగు హీరోయిన్ కూడా వెలుగు వెలుగుతున్నారు.
ఆమే మల్లి సీరియల్ హీరోయిన్ భావనా లాస్య. ‘స్టార్ మా’లో ప్రసారం అవుతున్న ఈ సీరియల్ కు మంచి రేటింగ్ ఉంది. ఊరిలో చదువుకోవాలి అని కలలు కన్న అమ్మాయి, అనుకోకుండా సిటీకి రావడం.. ఆ తర్వాత ఆమె ఎదుర్కొన్న సమస్యల చుట్టూ కథ తిరుగుతోంది. ఈ సీరియల్ లో టైటిల్ పాత్ర పోషిస్తుంది భావనా లాస్య. భావన పుట్టింది బెంగాల్ లో అయినా పెరిగింది మాత్రం వైజాగ్ లోనే. భావన తండ్రి రైల్వే ఉద్యోగి. కెనడాలో ఎంబీఏ పూర్తి చేసి ఉద్యోగం చేయాలనే కల ఉండేది. అనుకోకుండా ‘మల్లి’ అనే సీరియల్ అవకాశం వచ్చింది.
సోషల్ మీడియాలో తను పోస్ట్ చేసిన ఫొటోస్ చూసి స్టార్ మా భావనని సంప్రదించింది. ఇదంతా నిజం కాదని అనుకుంది. కానీ ఒకసారి ఫోన్ చేసి ‘సీరియల్ చేస్తావా?’ అని అడిగారు. ఒక సారి పరీక్షలు ఉన్నాయి.. మరో సారి ఆరోగ్యం బాగాలేదు.. అని ఏదో ఒక కారణం చెప్పి తప్పించుకుంటూనే ఉంది.
దీంతో భావనకు కొంచెం నమ్మకం వచ్చి సీరియల్ లో నటించడానికి అంగీకరించింది. ఈ విషయాన్ని వాళ్ల ఇంట్లో చెప్తే ఆమె తల్లి కూడా ప్రోత్సహించింది. తనకి యాక్టింగ్ రాదేమోనని భావన భయపడుతుంటే ‘ఒకసారి నటిస్తేనే కదా తెలుస్తుంది’ అని తల్లి ధైర్యం చెప్పింది. అలా సీరియల్స్ లోకి అడుగు పెట్టింది. భావన వయసు కేవలం 21 సంవత్సరాలు. ఇంత చిన్న వయసులోనే ఇంత గుర్తింపు సంపాదించుకుంది.
View this post on Instagram