చిరంజీవి చిన్న కూతురు శ్రీజ పెళ్లిలో ఆమె మన వస్త్రధారణతో ఆకట్టుకుంది. పవన్ కల్యాణ్ కు బొట్టు పెడుతుంది. దిష్టి తీస్తుంది. రేణు దేశాయిని రెండో వివాహం చేసుకున్న పవన్ ఆమెకు విడాకులిచ్చి అన్నా లెజినావాను చేసుకున్నాడు. ఈమెకు కూడా ఇద్దరు పిల్లలు. కూతురు పేరు పోలెనా అంజనా, కొడుకు పేరు మార్క్ శంకర్ పవనోచ్. కూతురు మీద పవన్ బాగానే ఆస్తులు కూడబెట్టాడని చెబుతుంటారు.
చిరంజీవి కుటుంబ సభ్యులకు ఆమె అంటే అభిమానం ఉంది. ఎందుకంటే ఆమె కట్టు బొట్టు చూసి ముచ్చట పడుతుంటారు. పెళ్లయిన కొత్తలో పవన్ తో కలసి డిన్నర్ కు వెళ్లేది కానీ ఈవెంట్లకు మాత్రం వెళ్లిన సందర్బాలు లేవు. సోషల్ మీడియాలో కూడా ఆమె ఎక్కడ ఫొటోలు అప్ లోడ్ చేయదు. అలా మెగా కుటుంబంతో పెనవేసుకుపోయింది.
2013 సెప్టెంబర్ 30న హైదరాబాద్ లోని ఎర్రగడ్డ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో వీరి వివాహం జరిగింది. పవన్ కల్యాణ్ హిందువు అన్నాలెజినోవా క్రిస్టియన్ కావడంతో స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ కింద వీరి వివాహం జరిగింది. దీంతో రష్యా సంప్రదాయాన్ని వీడి మన సంప్రదాయంలోకి వచ్చింది. అలా మనలో కలిసిపోయింది. దీంతో పవన్ కల్యాణ్ లెజినోవా జంట అలా ఒక్కటైంది.
ReplyForward
|