
sattigani rendu ekaralu : ఓటీటీలోని సినిమా రిలీజైనా థియేటర్ ఫీల్ తో చూస్తున్నారు ప్రేక్షకులు. సినిమా ఎక్కడ రిలీజైంది కాదు కథ, కథనం బాగుంటే చాలు అతుక్కుపోతున్నారు. కరోనా కాలంలో చాలా సినిమాలు ఓటీటీలో రిలీజై ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నాయి. మే 26 శుక్రవారం ఓటీటీలోని ఆహా ప్లా్ట్ ఫారం వేదికగా ‘సత్తిగాడి రెండెకరాలు’ రిలీజైంది. పుష్ప ఫేం జగదీశ్ ప్రతాప్ లీడ్ రోల్ లో నటించాడు. ఈ సినిమా ఎలా ఉందో ఇక్కడ చూద్దాం.
నటీ నటులు: జగదీశ్ ప్రతాప్, వెన్నెల కిశోర్, అనీషా దామా, వంశధర్ గౌడ్, బిత్తిరి సత్తి, మోహన శ్రీ, రాజ్ తిరందాస్
సంగీతం: జయ్ క్రిష్
సినిమాటో గ్రఫీ: విశ్వంత్ రెడ్డి
ఎడిటింగ్: అభినవ్ దండ
నిర్మాత: వై రవిశంకర్, నవీన్ యేర్నేని
దర్శకత్వం: అభినవ్ దండ
కథ
సత్తి (జగదీశ్ ప్రతాప్) తాత ఒక సమయంలో ఆసామి. ఆడంబరాలకు పోయి భూమినంతటిని అమ్మగా చివరికి 2 ఎకరాలు మాత్రమే మిగులుతుంది. అది సత్తికి వారసత్వంగా వస్తుంది. ఇద్దరు పిల్లల తండ్రి సత్తికి జీవితంలో ఎన్నో కష్టాలు అనుభవిస్తుంటాడు. ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తుంటాడు. ఇద్దరు పిల్లల్లో ఒక పాపకు గుండెలో రంధ్రం ఉండడంతో ఆపరేషన్ చేయించాలి అందుకు రూ. 25 లక్షలు కావాలి. ఆపరేషన్ కు ముందు వైద్యం కోసం ఆటోను అమ్మేస్తాడు. అయినా అప్పులు తీరవు. దీంతో వారసత్వంగా వచ్చిన ఆస్తిని అమ్మాలని అనుకుంటాడు. సైకిల్ పై వెళ్తుండగా ఒక కారు యాక్సిడెంట్ లో కనిపిస్తుంది. దగ్గరికి వెళ్లి చూసిన సత్తికి వెనుక సీటులో బ్రీఫ్ కేస్ కనిపిస్తుంది. దానికి అతడు చోరీ చేస్తాడు. అసలు ఆ సూట్ కేసులో ఏముంది..? కారు ఎవరిది..? ప్రమాదానికి గురైందా..? లేక కవాలనే చేశారా..? బ్రీఫ్ కేస్ తీసుకున్న సత్తి జీవితం తర్వాత ఎలా మారుతుంది అనేది కథ. దీన్ని మాత్రం ఆహాలో చూడాల్సిందే.
ఇంతకీ ఎలా ఉందంటే
ఈ మూవీ క్రైమ్ కామెడీ డ్రామాగా కొనసాగుతుంది. ఇలాంటి కథలు తెలుగు చిత్రాల్లో చాలానే కనిపించాయి. దర్శకుడు అభినవ్ దండ కథలో కొత్తదనం ఏమీ కనిపంచలేదు. కనీ పల్లెటూరి నేపథ్యం కొంచెం చిత్రానికి హైలెట్ గా నిలుస్తుంది. ఇటీవల పల్లె అందాలను చిత్రాలకు అద్దుతున్నారు దర్శకులు. ఈ దర్శకుడు కూడా తెలంగాణ పల్లెలో జరిగిన కథ అంటూ తెరకెక్కించాడు. పల్లె వాతావరణం, యాస, భాష ఇలా కొన్ని అంశాలు బాగా ఆకట్టుకున్నాయి. వెన్నెల కిశోర్, బిత్తిరి సత్తి కామెడీ బాగా హైలెట్ అయ్యాయి. కథ మత్రం స్లోగా సాగుతున్నట్లు అనిపిస్తుంది. పెద్దగా మలుపులు ఏమీ కనిపించవు. అక్కడక్కడ కొన్ని సన్నివేశాలు ప్రేక్షకుడిలో ఆసక్తిని రేపుతాయి.
పర్ఫార్మెన్స్
జగదీశ్ ప్రతాప్, వెన్నెల కిశోర్, రాజ్ వారి వారి పాత్రల్లో మెప్పించారు. వెన్నెల కిశోర్ కు డిఫరెంట్ పాత్ర ఇచ్చారు. మురళీధర్ గౌడ్, బిత్తిరి సత్తి తమ పరిధి మేరకు నటించారు. బిత్తిరి సత్తిని ఇంకొంచెం వాడుకుంటే ఇంకా బాగుండేది. జయ్ క్రిష్ పాటలు, మ్యూజిక్ బాగుంది. సినిమాటోగ్రఫీ కూడా పర్వాలేదు. తెలంగాణ పల్లె జీవనాన్ని మరో సినిమాలో ఆవిష్కరించినట్లు అనిపిస్తుంది. తక్కువ నిడివి ఉన్నసినిమాలో సీన్లు రిపీట్ అవుతున్నట్లు అనిపిస్తుంది.
బలాలు
నటీనటులు, నేపథ్యం, కామెడీ సీన్స్, క్లైమాక్స్
బలహీనతలు
ఊహించిన కథనమే, ఫస్టఆఫ్ సీన్స్