
Atal Bihari Vajpayee : దివంగత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయి గురించి మనకు తెలిసిందే. రాజకీయాల్లో మచ్చలేని నేతగా ఉన్నారు. ప్రధానిగా 13 రోజులు పనిచేసినా ఎక్కడ కూడా ఆయనపై విమర్శలు రాలేదు. పరిపాలనలో తనదైన శైలిలో దూసుకెళ్లారు. పాకిస్తాన్ కు భయం పుట్టించడంలో కూడా మంచి ఫలితాలు సాధించారు. స్నేహహస్తాన్ని అందించి వారితో మైత్రి కొనసాగించాలని భావించారు.
పాక్ పాలకుల పన్నాగంతో వాజ్ పేయి ఇచ్చిన అవకాశాన్ని వినియోగించుకోలేదు. కార్గిల్ లో దురాక్రమణకు ప్రయత్నించి పాకిస్తాన్ అభాసుపాలైంది. మన దేశం చేతిలో చావుదెబ్బలు తిన్నది. అయినా వారికి బుద్ధి రాలేదు. మనదేశంపై తీవ్రవాదమనే జాడ్యాన్ని పంపించి అనేక రూపాల్లో దాడులు చేసేందుకు ప్రయత్నించినా మనదేశం తిప్పి కొట్టింది.
ఇటీవల కాలంలో బయోపిక్ లకు బాగా డిమాండ్ ఏర్పడుతోంది. ప్రముఖుల బయోపిక్ లు సినిమాలుగా తీస్తున్నారు. రవి జాదవ్ దర్శకత్వంలో పంకజ్ త్రిపాఠి కథానాయకుడిగా వస్తున్న ఈ సినిమా జనవరి 19న విడుదల కానుంది. దీంతో సినిమాపై అందరికి ఆసక్తి ఏర్పడుతోంది. వాజ్ పేయి జీవితాన్ని ఎలా చూపించారనే చొరవ కలుగుతోంది.
అటల్ బిహారీ వాజ్ పేయి జీవితం తెరిచిన పుస్తకం. మచ్చలేని మహారాజు అని చాలా మంది చెప్పేవారు. అలా ఆయన రాజకీయ ప్రయాణం సాగింది. బ్రహ్మచారిగానే కన్నుమూశారు. బీజేపీ బలోపేతం శక్తివంచన లేకుండా కష్టపడ్డారు. 90వ దశకంలో ఆయన సత్తా నడిచింది. పార్టీని ముందుకు నడిపించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయనను బీజేపీకి దార్శనికుడిగా చూసేవారు.