30.1 C
India
Sunday, April 19, 2026
More

    ‘వ్యవస్థ’ వెబ్ సిరీస్ ఎలా ఉందంటే..

    Date:

    Vastha web series
    Vastha web series

    తారాగణం : 

    కార్తీక్ రత్నం, హెబ్బా పటేల్, కామ్నా జఠ్మలాని, సంపత్ రాజ్, గురురాజ్, రామారావు జాదవ్, తదితరులు
    దర్శకత్వం : ఆనంద్ రంగా
    నిర్మాత: పట్టాభి ఆర్ చిలుకూరి
    ఛాయా గ్రహణం: అనిల్ బండారి
    సంగీతం: నరేశ్ కుమరన్
    ఓటీటీ: జీ5

    సినిమాల కంటే కూడా ఈ జనరేషన్ వెబ్ సిరీస్ కు ఎక్కువ అట్రాక్ట్ అవుతున్నారు. సినామాలైతే రెండున్నర గంటల్లో పూర్తి స్థాయి కంటెంట్ ఉండడం లేదని, వెబ్ సిరీస్ అయితే ఎపీసోడ్ల వారీగా పూర్తి కంటెంట్ ఉంటుందని వాటిని ఎక్కువగా ఇష్ట పడుతున్నారు ప్రేక్షకులు. అయితే జీ5 ఫ్లాట్ ఫారంపై లెటెస్ట్ గా వచ్చిన ‘వ్యవస్థ’ గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..

    అసలు కథ : 

    శోభనం గదిలో జరిగిన మర్డర్ చుట్టూ కథ ఉంటుంది. యామిని (హెబ్బా పటేల్)కు అజయ్ తో వివాహం జరుగుతుంది. వీరి మొదటి రాత్రి శోభనం గదిలోకి వెళ్లాక తుపాకీ పేలిక శబ్ధం వస్తుంది. వెంటనే బంధువులు, కుటుంబ సభ్యులు వెళ్లి చూడగా అజయ్ రక్తపుమడుగులో పడి ఉంటాడు. యామిని చేతిలో గన్ ఉంటుంది. యాజ్ యూజివల్ గా పోలీసులు వచ్చి యామినిని అరెస్ట్ చేస్తారు. తనను కేసు వాదించాలని యామిని లాయర్ అవినాశ్ చక్రవర్తి (సంపత్ రాజ్)ను పెట్టుకుంటుంది.

    అన్ని అనివార్య కారణాల వల్ల తన కేసును మరో లాయర్ వంశీకృష్ణ (కార్తీక్ రత్నం)కు ఇచ్చుకుంటానని యామిని ట్విస్ట్ ఇస్తుంది. దీంతో అయితే అవినాశ్ చక్రవర్తి ఆమెపై పగ పెంచుకుంటాడు. యామినితో పాటు వంశీకృష్ణను కూడా ఈ కేసులో ఇన్వాల్వ్ చేస్తాడు అవినాశ్. తర్వాత ఏమైంది.. అసలు వంశీకృష్ణ ఇందులో ఎలా ఇరుక్కున్నాడు. అజయ్ ని యామిని ఎందుకు చంపింది అన్నది సిరీస్ చూడాల్సిందే..

    ఎలా ఉందంటే :

    కోర్టు డ్రామా ప్రేక్షకుడికి బాగా నచ్చే అంశం. కేసులు, సెక్షన్లు అందులోని లూప్ హోల్స్, ఎత్తుకు పైఎత్తు వేసే లాయర్లు. అప్పుడప్పుడూ వచ్చే బ్యాగ్రౌండ్ సీన్లు ఇలా ప్రతీ ఒక్కరి ఉత్సుకతతో సాగుతుంది. వీటికి ఆదరణ ఉంటుందని గ్రహించిన ‘వ్యవస్థ’ టీమ్ డిఫరెంట్ కథతోనే వచ్చినా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. శోభనం గదిలో జరిగిన సీన్.. పోలీసుల అరెస్ట్ ఇవ్వన్నీ స్ట్రాటింగ్ ఎపీసోడ్ లో ఇంట్రస్టింగ్ క్రియేట్ చేసినా తర్వాత కథ నెమ్మదిగా సాగుతుంది. 8వ ఎపీసోడ్ వరకూ దర్శకుడు లాగ్ చేశాడు. ఇక కోర్టు రూమ్ కథ అంటే ప్రేక్షకుడికి ఒక క్యూరియాసిటీ ఉంటుంది. కేసులోని చిక్కుముడులు వీడడం. మర్డర్ కు ముందు ఏం జరిగింది రివీల్ చేస్తారనుకోవడం సహజం. కానీ ఇందులో అది లోపించింది.

    ఇక లాయర్ గా అవినాశ్ చక్రవర్తి పాత్ర బాగా ఎలివేట్ అయ్యింది. కోర్టుకు సంబంధించి వ్యవస్థను తన గుప్పిట్లో పెట్టుకోవడం. అడ్డు తగులుతున్న లాయర్లను అనగదొక్కడం ఇలాంటివి చేస్తుంటాడు అవినాశ్. అయితే ఆయనకు ఎదురు వెళ్లిన జూనియర్ లాయర్ వంశీకృష్ణపై కూడా పడబడతాడు అవినాశ్ చక్రవర్తి. లాయర్ అంటే దాదాపు కోర్టు సన్నివేశాల్లో మాత్రమే కనిపిస్తాడని తెలుస్తోంది. ఇది ఇలాగే సాగితే కథకు మంచి బలం చేకూరేది. కానీ యామినికి వంశీకృష్ణకు గత చరిత్ర కూడా ఉంటుంది. దీంతో కథ బలం కోల్పోయింది. అవినాశ్ చక్రవర్తి భార్య గాయత్రి (కామ్నా జఠ్మలాని) ఆయన కూతురు విదేశాల్లో ఉంటుంది. సిరీస్ చివరిలో ‘చెక్‌మేట్’ బాధ్యలు తీసుకునే సమయం వచ్చిందని గాయత్రీ కూతురుకు ఫోన్ చేస్తుంది. అంటే సీజన్ 2 కూడా ఉండబోతోందని డైరెక్టర్ చెప్పారు.

    పర్మామెన్స్ : నారప్ప, కేరాఫ్ కంచెరపాలెం సినిమాల్లో నటించిన కార్తీక్ రత్నం ఈ సిరీస్ లో తన నటనతో మరింత ఆకట్టుకున్నాడు. ఇక నెగెటివ్ రోల్ లో సంపత్ రాజ్ లాయర్ చక్రవర్తి పాత్రకు జీవం పోశాడనే చెప్పాలి. హెబ్బా పాత్ర సిరీస్ కే కీలకం అయినా సరైన స్కోప్ లేదు. ఇన్నాళ్లు సినిమాల్లో నటించిన కామ్నా జఠ్మలాని ఫస్ట్ సిరీస్ ఇది. కానీ అంత స్కోప్ లేని పాత్రే. నేపథ్య సంగీతం ప్రాణం పోసింది. ఛాయాగ్రహణం ఫర్వాలేదనిపించింది. ఎడిటింగ్ విషయంలో మరింత శ్రద్ధ పెట్టాలి. ‘ఓయ్’ సినిమాను తీసిన దర్శకుడు ఈ సిరీస్ ను డైరెక్ట్ చేశాడు.

    చివరగా : కోర్టులో సీనియర్ లాయర్లు, జూనియర్ల లాయర్ల మధ్య కుమ్ములాటనే ఈ సిరీస్.

    బలాలు : కార్తీక్ రత్నం, సంపత్ రాజ్ ల నటన, కోర్టులోని సన్నివేశాలు

    బలహీనతలు : కథ, కథనం

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    90s A Middle Class Biopic : 90’s మిడిల్ క్లాస్ బయోపిక్ లో నటించిన ఈ నటి ఎవరో తెలుసా?

    90s A Middle Class Biopic : ప్రస్తుత జామానా వెబ్...

    Bigg boss Siri ముందరి అందాలతో మంటలు పుట్టించిన సిరి.. మొత్తం ఓపెన్ చేసేసింది..!

    bigg boss siri సిరి హన్మంతు అంటే సోషల్ మీడియాలో సెన్సేషన్....

    Save the Tigers : ‘సేవ్ ద టైగర్స్’ వెబ్ సిరీస్ లో నటించిన ఈ అమ్మడి బ్యాగ్రౌండ్ తెలుసా..? ఆమె చేసిన సినిమాలు ఏవో తెలుసా.?

    Save the Tigers : ఇటీవల డిస్నీ+హాట్‌స్టార్ విపరీతంగా స్ట్రీమింగ్ అవుతున్న సిరీస్...

    Shaitan Web Series : సైతాన్ వెబ్ సిరీస్ నటిస్తున్న అమ్మడు ఎవరో తెలుసా?

    Shaitan web series : మహి వి రాఘవ దర్శకత్వంలో హాట్...