
Prabhas :
బాలీవుడ్ స్టార్ హీరోలకంటే ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకుంటున్న నటుడు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్. బాహుబలికి ముందు కెరీర్ నడుస్తుందిలే.. అన్నట్లు ఉన్నా.. బాహుబలి తర్వాత మాత్రం బాలీవుడ్ ను దాటి ముందుకెళ్లాడు. ఏ సినిమా అయినా సరే ఆయన పారితోషికం రూ. 100 కోట్ల వరకు ఉంటుంది. ఇక భారీ సినిమా అయితే చెప్పనవసరం లేదు.
ప్రస్తుతం 3 భారీ ప్రాజెక్టుల్లో బిజీగా ఉన్నాడు ప్రభాస్. ఇక ఆయన రెమ్యునరేషన్ మూడింటిలో కలుపుకొని రూ. 300 కోట్లు పైమాటే. ఈ మొత్తాన్ని ఇటీలీలో కొన్ని వ్యాపారాలల్లో పెట్టుబడిగా పెడుతున్నాడట. అక్కడ భారీగా విల్లాలు, స్థలాలు కూడా కొన్నాడట ప్రభాస్. వీటితో పాటు ఫుడ్ రెస్టారెంట్లు నడుపుతున్నారట. కమర్షియల్ కాంప్లెక్స్ లను కూడా కట్టి అద్దెలకు ఇస్తున్నాడట. ఇక ఈ వ్యాపారాల విలువ కోట్లను దాటి వేలాది కోట్లలోకి వెళ్తుంది. ఇంత పెద్ద వ్యాపార సామ్రాజ్యాన్ని సృష్టిస్తున్నాడు ప్రభాస్.
ఇక ప్రభాస్ షూటింగ్ లేని సమయాల్లో ఒంటరిగా గడిపేందుకు ఇటలీలోనే ఒక విల్లాను నిర్మించుకున్నాడట. అప్పుడప్పుడు తన స్నేహితులతో కూడా అక్కడికి వెళ్లి చిల్ అవుతుంటాడట. ఆయనకు ఇటలీలో ఉన్న ఆస్తుల వివరాలు మొత్తాన్ని లెక్కిస్తే వెయ్యి కోట్లకు పైగానే ఉంటాయట. ఈ పెట్టుబడుల ద్వారా ఆయనకు నెల రూ. 100 కోట్ల వరకు ఆదాయం వస్తుందట. అంటే ఆయన తీసుకునే రెమ్యునరేషన్ అంతన్నమాట. సినిమాలు లేని సమయంలో వీటి ఆదాయం ఆయనకు అక్కరకు వస్తుంది. ఈయన రేంజ్ లో డబ్బులు సంపాదిస్తున్నవారు బాలీవుడ్ ఇండస్ట్రీలో సైతం లేదని పలువురు అనుకుంటున్నారు.
ఇక, ఆయన లెటెస్ట్ మూవీ ‘ఆదిపురుష్’ భారీగానే వసూలు చేస్తున్నా. నెగెటివ్ టాక్ వచ్చింది. అంటే ఆయన ఖాతాలో మరో ఫ్లాప్ చేరినట్టే. ఆయన తర్వాత సలార్ ప్రాజెక్టుకు సిద్దం అవుతున్నారు. ఆ తర్వాత ప్రాజెక్ట్ కే లో కూడా ఆయన హీరోగా నటిస్తున్నారు. ఈ చిత్రానికి వైవిద్య దర్శకుడు నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించనున్నారు.