
Eating Raisins : మనం డ్రై ఫ్రూట్స్ ను తినడం వల్ల ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఎండు ద్రాక్షతో ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. ఇందులో ఉండే ప్రత్యేక గుణాలతో రోజు ఉదయాన్నే ఖాళీ కడుపుతో వీటిని నానబెట్టి తింటే మంచి లాభాలుంటాయి. ఖాళీ కడుపుతో నానబెట్టిన ఎండు ద్రాక్షను తీసుకుంటే రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయిలు పెరగడమే కాకుండా రక్తం శుభ్రం అవుతుంది.
వీటిని తినడం వల్ల జీర్ణ సమస్యలు లేకుండా పోతాయి. ఎండు ద్రాక్షను పరగడుపున నానబెట్టి తింటే రక్తం శుభ్రం అవడమే కాకుండా లివర్ కూడా బాగా పనిచేసేందుకు దోహదపడతాయి. జీర్ణక్రియ మెరుగుపరచడంలో సాయపడతాయి. ఎండు ద్రాక్షలు తింటే గుండె, కాలేయం రెండు బాగుండేందుకు సాయపడతాయి
నానబెట్టి తినడం వల్ల గుండెకు చాలా మంచిది. పేగులు కూడా క్లీన్ అవుతాయి. ఎండు ద్రాక్షల్ని నాలుగు రోజులు వరుసగా నానబెట్టి తనడం వల్ల కడుపులో ఎలాంటి మలినాలు లేకుండా చేస్తాయి. ఇలా ఎండు ద్రాక్షలు మన శరీరానికి ఎంతో దోహదం చేస్తున్నాయి.
ఆయుర్వేదంలో డ్రై ఫ్రూట్స్ కు ప్రాధాన్యం ఉంటుంది. వీటిని తినడం వల్ల కడుపులో ఎలాంటి ఇబ్బందులు ఉండవు. డ్రై ఫ్రూట్స్ తినడం వల్ల కడుపులో గ్యాస్ వంటి సమస్యలు రాకుండా ఉంటాయి. దీంతో వీటిని తిని మనం ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.