
Lemon Juice : వేసవిలో దాహం అధికంగా ఉంటుంది. దీంతో దప్పిక తీర్చుకునేందుకు పలు మార్గాలు అన్వేషించాలి. మనకు సిట్రస్ పండ్లలో దాహం తీర్చే గుణం ఉంటుంది. ఇందులో నిమ్మకాయకు ఎంతో ప్రాధాన్యం ఉంటుంది. నిమ్మకాయలో ఎన్నో రకాల ఔషధ గుణాలున్నాయి. అందుకే దీన్ని నమ్ముకుని చాలా మంది ఆరోగ్యాన్ని కాపాడుకుంటున్నారు. నిమ్మరసం తాగితే మనకు ఎన్నో రకాల ప్రయోజనాలు దక్కుతాయి. ఈ మేరకు వేసవిలో ఎంత తీసుకుంటే అంత మన ఆరోగ్యం మెరుగుపడుతుందని చెబుతున్నారు.
డీ హైడ్రేషన్ సమస్యను దూరం చేస్తుంది. నిమ్మరసం మూడు పూటలు తీసుకుంటే శరీరంలో నీటి శాతం తగ్గకుండా చేస్తుంది. దీంతో వడదెబ్బ ముప్పు ఉండదు. వేసవిలో మూడు పూటలు నిమ్మరస తీసుకుంటే ఒంట్లో వేడిని తగ్గిస్తుంది. ఇలా నిమ్మరసం తీసుకుంటే మనకు ఎన్నో సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. అందుకే దీన్ని తీసుకుని మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి.
దీన్ని తాగడం వల్ల ముసలితనం రాదు. చర్మం ప్రకాశవంతంగా మెరిసేందుకు సాయపడుతుంది. నిమ్మరసం తాగడం వల్ల మనకు చాలా రకాల ప్రయోజనాలు అందుతాయి. ఎండాకాలంలో నిమ్మరసం తాగడం వల్ల మనకు కలిగే లాభాల నేపథ్యంలో దాన్ని తీసుకుని కాపాడుకోవాలని సూచిస్తున్నారు. నిమ్మరసం తాగడం వల్ల మన ఒంట్లోని వేడిని తగ్గేలా చేస్తుంది.
గ్యాస్, ఎసిడిటి, అజీర్తి, మలబద్ధకం సమస్యల నుంచి దూరం చేస్తుంది. వ్యర్థాలను దూరం చేసి లివర్ ను శుభ్రంగా ఉంచుతుంది. నోటి దుర్వాసన రాకుండా నిరోధిస్తుంది. దంత సమస్యలను పోగొడుతుంది. చెడు కొవ్వును కరిగిస్తుంది. ఇలా నిమ్మరసం తాగడం వల్ల మనకు కలిగే ఉపయోగాలు ఎన్నో ఉన్నాయి. అందుకే నిమ్మరసం ప్రతి రోజు తాగడం ఎంతో మంచిది.