
Donda Kaya : దొండకాయను చాలా మంది తినడానికి ఇష్టపడరు. కానీ పోషకాల విషయంలో దొండకాయలో ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి. దీంతో దీన్ని తరచుగా తింటే ఆరోగ్యానికి ఎంతో మంచిది. కొందరు మాత్రం దీన్నితినేందుకు అసలు ముందుకు రారు. కానీ దీని లాభాలు తెలిస్తే ఎవరు కూడా వదిలిపెట్టరు. ఇందులో ఉండే పోషకాలు తెలిస్తే మాత్రం దీన్ని తప్పకుండా తినేందుకు మొగ్గు చూపడం ఖాయం.
దొండకాయలో ఫైబర్, విటమిన్ బి1, బి2, బి3, బి6, బి9, విటమిన్ సి, కాల్సియం, మెగ్నిషియం, ఐరన్, పాస్పరస్, పొటాషియం, సోడియం, జింక్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. దొండకాయ తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు అనేకం ఉన్నాయి. దీంతో దొండకాయను తీసుకుంటే మనకు ఆరోగ్య లాభాలు కలగడం సహజం.
దొండకాయ మధుమేహానికి మంచి మందులా పనిచేస్తుంది. దీని వల్ల రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడంలో ఇది ప్రముఖ పాత్ర పోషిస్తుంది. షుగర్ ఉన్న వారు వారంలో ఒకరోజు దీన్ని తినడం వల్ల డయాబెటిస్ కంట్రోల్ లో ఉంటుంది. దొండ ఆకుల రసం తాగినా చక్కెర స్థాయిలు తగ్గడం వాస్తవం. దీంతో దొండకాయ తినడం ఆరోగ్యానికి మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
దొండకాయ శరీర బరువును నియంత్రణలో ఉంచుతుంది. అధిక బరువును అదుపులో ఉంచుతుంది. దీంతో శరీర బరువును కంట్రోల్ చేస్తుంది. ఇలా దొండకాయతో మనకు మలబద్ధకం సమస్య నుంచి ఉపశమనం కలిగిస్తుంది. ఎసిడిటికి చెక్ పెడుతుంది. అజీర్తి లేకుండా చేస్తుంది. ఇలా దొండకాయ మనకు ఎన్నో లాభాలు కలిగిస్తుంది.