
Hours of sleep : మనిషికి నిద్ర చాలా అవసరం. ఒక మనిషి సగటున 7-9 గంటలు నిద్రపోవాలి. లేదంటే అనారోగ్యాల బారిన పడుతాం. వరుసగా పదకొండు రోజుల పాటు నిద్ర పోకపోతే మనిషి ప్రాణాలే పోతాయట. అలాంటి నిద్ర మనిషికి చాలా అవసరం. ఈ నేపథ్యంలో నిద్ర చాలా ముఖ్యం. ఏ జీవికైనా నిద్ర అవసరమే. ఇలా నిద్ర గురించి మనకు ఎన్నో రకాల విషయాలు ఉన్నాయి. అందుకే నిద్ర సరిగా పోకపోతే శరీరం సహకరించదు.
నీరసం వస్తుంది. అలసట అనిపిస్తుంది. ఏ పని చేయబుద్ధి కాదు. చీటికి మాటికి కళ్లు మూతలు పడతాయి. ఇలా పలు లక్షణాలు నిద్ర లేని వారికి ఉంటాయి. దీంతో మనకు నిద్ర ఎన్ని గంటలు పోవాలనే దాని మీద కొన్ని పరిశోధనలు కూడా చేశారు. 18-65 ఏళ్ల మధ్య ఉన్న వారు 7-9 గంటలు నిద్ర పోవడం మంచిది. 65 ఏళ్లు దాటిన వారు 7 గంటలు నిద్రపోవాలి. చిన్న పిల్లలు అయితే 18 గంటలు నిద్ర పోతే మంచిది. 10 ఏళ్లు దాటిన వారు 9 గంటలు నిద్ర పోవాలి. ఇలా వయసులను బట్టి నిద్ర పోవాలి.
నిద్ర సరిగా పోకపోతే కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. చేసే పనిలో ఎక్కువగా శ్రమిస్తున్నారా? పగటి సమయంలో నిద్ర వస్తున్నట్లు అనిపిస్తుందా? కాఫీ, టీలు తాగనిదే పనిచేయలేకపోతున్నారా? అయితే మీకు ఇంకా నిద్ర అవసరమనే విషయం గుర్తించాలి. ప్రస్తుతం పడుకునే దాని కంటే ఇంకా ఎక్కువ సమయం నిద్రపోతే హాయిగా ఉంటుంది.
ఇంకా మధుమేహం, రక్తపోటు వంటి సమస్యలు ఉన్న వారికి సైతం నిద్ర సరిగా పట్టదు. దీంతో వారు సమస్యలు ఎదుర్కోవాల్సిందే. కానీ నిద్ర పట్టకపోవడానికి సరైన కారణాలు తెలుసుకుని మంచి నిద్ర పోయేందుకు జాగ్రత్తలు తీసుకోవాలి. అప్పుడే మన రోగనిరోధక వ్యవస్థ మెరుగుపడుతుంది. మన ఆరోగ్యం మెరుగవుతుంది. దాని కోసమే చర్యలు తీసుకోవాలి.