Nara Lokesh : ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారంను ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా ‘సిద్ధం’ అంటూ సభలు, సమావేశాలు నిర్వహిస్తూ ముందుకెళ్తున్నారు. ఏపీ రాజకీయాల్లో టీడీపీ అధినేతను తనకు ప్రత్యర్థిగా చూపేందుకు ప్రయత్నిస్తూ చంద్రబాబు నాయుడిపై నిరంతరం ఫోకస్ పెట్టడం ఆయన ‘సిద్ధం’ ప్రచార ప్రధానాంశాల్లో ఒకటిగా మారింది. ఈ విషయాన్ని నారా లోకేష్ తన సోషల్ మీడియా పోస్ట్ లో హైలైట్ చేస్తూ జగన్ పై ఈ అంశాన్ని వాడుకున్నారు.
నిన్న రాప్తాడులో జగన్ ‘సిద్ధం’ సభకు సంబంధించిన వీడియోను నారా లోకేష్ షేర్ చేశారు. ఈ వీడియోలో జగన్ 108 సార్లు చంద్రబాబు పేరును ఉచ్ఛరించారని లోకేశ్ తెలిపాడు. ముఖ్యంగా సీఎం జగన్ ప్రసంగంలో చంద్రబాబు ప్రస్తావన ఉంటుందని స్టేట్ మొత్తం తెలుసని కానీ అది కాస్తా 108 సార్లు నాయుడు అని పేరును ఉచ్చరించేంతగా మారిందన్నారు.
‘ముఖ్యమంత్రి నిన్న తన ప్రసంగంలో చంద్రబాబు గారి పేరును 108 సార్లు ప్రస్తావించారు. @ysjagan సీబీఎన్ ఫీవర్ తో బాధపడుతున్నట్లు కనిపిస్తోంది, త్వరగా కోలుకోండి!.’ అంటూ క్యాప్షన్ కూడా పెట్టారు.
ఎన్నికల ప్రచారంలో భాగంగా గంటపాటు జరిగిన సమావేశంలో ప్రతిపక్ష నేత పేరును 108 సార్లు ప్రస్తావిస్తూ జగన్ బాగా భయంలో ఉన్నారని లోకేశ్ విమర్శలు గుప్పించారు. ఇటీవలి కాలంలో జగన్ తన ఎన్నికల ప్రచారాల ప్రసంగాల్లో చంద్రబాబు పేరును ఉచ్ఛరిస్తూ భజనలు చేస్తున్నాడని తెలుగు దేశం పార్టీ కార్యకర్తలు సైతం వ్యాఖ్యానిస్తున్నారు.
The Chief Minister mentioned @ncbn Garu’s name 108 times during his speech yesterday. @ysjagan seems to be suffering with CBN Fever, get well soon!#YCPAntham
#Shankharavam#AndhraPradesh pic.twitter.com/y5OZkrZKjB— Lokesh Nara (@naralokesh) February 19, 2024