Social Media Promotion in Telangana Elections 2023 : ఐదేళ్లకు ఒక సారి వచ్చే అతిపెద్ద జాతర ఎన్నికలు. అది అసెంబ్లీ కావచ్చు, పార్లమెంట్ కావచ్చు. పార్లమెంట్ కంటే అసెంబ్లీ ఎన్నికల్లో అభ్యర్థులు గెలిచేందుకు ఖర్చు ఎక్కువగా పెడతారు. దాదాపు పదేళ్ల ముందు వరకు ఎన్నికలు అంటే ఎక్కువగా చేతి వృత్తులకు పని లభించేది. ఆర్టిస్టులు బ్యానర్లు రాస్తే, మేదరి వాళ్లు వాటిని చౌరస్తాలో పెట్టేవారు. ఇంకా చాలా మంది చేతి పని వారలకు ఉపాధి లభించేది. కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి.
ఇప్పుడు సోషల్ మీడియా ఎక్కువగా ప్రాచుర్యంలో ఉంది కాబట్టి. ఎన్నికల్లో నిలబడే ప్రతీ ఒక్క అభ్యర్థి, పార్టీలు సోషల్ మీడియాకు విపరీతంగా ఖర్చు పెడుతున్నారు. 2023 ఎన్నికల్లో మూడు ప్రధాన పార్టీలు భారీగా ఖర్చుపెట్టాయి. ఈ వివరాలను గూగుల్ రిలీజ్ చేసింది. ఆ లెక్క ప్రకారం చూస్తే ప్రభుత్వ పార్టీ బీఆర్ఎస్ అత్యధికంగా ఖర్చు పెట్టగా.. తర్వాతి ప్లేస్ లో కాంగ్రెస్ పార్టీ ఉంది. ఇక, మూడో స్థానంలో కమలం గుర్తు పార్టీ బీజేపీ ఉంది.
అయితే, ఫేస్ బుక్ లో యాడ్స్ ఈ సారి ముఖ్య పాత్ర పోషించినట్లు కనిపిస్తుంది. ఇందులో కాంగ్రెస్ 150 అడ్వర్‌టైజ్‌మెంట్లను ఇచ్చింది. కేవలం రెండు నెలలకే దాదాపు రూ. 92 లక్షలకు పైగా ఖర్చు పెట్టింది. రూ. 8 కోట్లతో 1581 గూగుల్ యాడ్స్ వేయించింది. మొత్తంగా కాంగ్రెస్ పార్టీ ఆగస్ట్ నుంచి ప్రచారం ముగిసే వరకు రూ. 4 కోట్ల, 12 లక్షల, 8వందలకు పైగా ఖర్చు చేసింది.
ఇక పాలక పార్టీ అయిన బీఆర్ఎస్ 1493 యాడ్స్ ఇచ్చి రూ. 10.69 కోట్లను ఖర్చు చేసింది. ఇది కేవలం 26 రోజుల్లోనే ఖర్చు చేసింది. ఇక కమలం పార్టీ వివిధ పోస్ట్ లతో రూ. 10 లక్షల వరకు మాత్రమే ఖర్చు చేసింది. ఈ వివరాలను గూగుల్ ప్రకటించింది.