
first remuneration ntr : జూనియర్ ఎన్టీఆర్.. ఈ పేరు వింటే చాలు తెలుగు రాష్ట్రాల్లో పూనకాలే.. ఎన్టీఆర్ కు మాస్ లో ఉన్న ఫాలోయింగ్ ఏ రేంజ్ లో ఉంటుందో తెలుసా.. ఈయన నందమూరి వారసుడిగా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన కూడా తన వెనుక ఉన్న వ్యక్తులు ఎవరు లేరనే చెప్పాలి.. ఎలాంటి సపోర్ట్ లేకుండా ఈయన ఎదిగాడు.. విమర్శించిన వారి చేతనే ప్రశంసలు అందుకునే స్థాయికి ఎన్టీఆర్ ఎదిగారు.
ఈ రోజు ఎన్టీఆర్ తన పుట్టిన రోజును జరుపు కుంటున్న నేపథ్యంలో ఈయన గురించి కొత్త కొత్త విషయాలు బయటకు వస్తున్నాయి.. ఈ క్రమంలోనే తారక్ మొదటిసారి అందుకున్న రెమ్యునరేషన్ గురించి కూడా ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఎన్టీఆర్ బాల నటుడిగానే ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టారు.. ఆ తర్వాత టీనేజ్ లోనే హీరో అయ్యాడు..
ఎన్టీఆర్ ముందుగా నటించిన చైనా బ్రహ్మర్షి విశ్వామిత్ర.. బాల భరతుడిగా ఎన్టీఆర్ ఈ సినిమాలో కనిపించాడు.. కానీ ఈ సినిమా రిలీజ్ కాలేదు.. ఆ తర్వాత గుణశేఖర్ దర్శకత్వంలో బాల రామాయణం చేసారు. అందులో ఎన్టీఆర్ రాముడి పాత్రలో కనిపించారు.. ఇది సూపర్ హిట్ అయ్యింది. ఈ సినిమా తర్వాత 5 ఏళ్ల గ్యాప్ ఇచ్చి హీరోగా ఎంట్రీ ఇచ్చారు తారక్..
”నిన్ను చూడాలని” అనే సినిమా ఎన్టీఆర్ మొదటి సినిమా.. 18 ఏళ్ల వయసులోనే హీరోగా మారిపోయిన ఎన్టీఆర్ ఈ సినిమా కోసం అప్పట్లో 4 లక్షల పారితోషికం తీసుకున్నట్టు తెలుస్తుంది. ఈ డబ్బును ఎలా ఖర్చు చేయాలో తెలియాలి తల్లికి ఇచ్చేశారట.. ఇలా 4 లక్షల రెమ్యునరేషన్ తో మొదలు పెట్టిన తారక్ ఈ రోజు వార్ 2 సినిమాకు 100 కోట్లు, దేవర సినిమాకు 80 కోట్లు పుచ్చుకుంటున్నాడు.