
Heroine of Premiste is Now : కొన్ని సినిమాలు ఎన్నేళ్లయినా మదిలో నిలిచిపోతాయి. కథ, కథనం ఎంతో ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఇక ఆ కథను రక్తి కట్టించే నటుల గురించి వేరే చెప్పక్కర్లేదు. వారితోనే మనం విపరీతంగా కనెక్ట్ అవుతాం. అలాంటి కొందరు తారల్లో సంధ్య కూడా ఒకరు. యధార్థ గాధను ఆధారం చేసుకొని నిర్మించిన సినిమా ‘ప్రేమిస్తే’. ఈ మూవీ 2014లో రిలీజ్ అయ్యింది. ఆ కాలంలో యూత్ ను విపరీతంగా ఆకట్టుకుంది ఈ సినిమా. ఈ మూవీకి వెళ్లని యంగ్ పర్సన్ లేడంటే అతిశయోక్తి కాదు. ఆంతలా ఆకర్షించింది ఈ సినిమా.
తమిళ్ డైరెక్టర్ బాలాజీ శక్తివేల్ ఈ సినిమాను తెరకెక్కించారు. భరత్, సంధ్య ఇందులో హీరో హీరోయిన్లుగా నటించారు. భరత్ అప్పటికే బాయ్స్ లాంటి సినిమాలో నటించగా, సంధ్యకు మాత్రం ఇది తొలిచిత్రం. ఆడియన్స్ ను బాగా ఆకట్టుకున్న ఈ మూవీ కమర్షియల్ హిట్ గా నిలిచింది. తమిళ్ లో తీసినా తెలుగు, కన్నడ, మళయాలంలో డబ్ చేశారు. ఈ సినిమాలో సంధ్య పర్ఫార్మెన్స్ చాలా బాగుంటుంది. మొదటి సినిమానే అయినా చాలా అనుభవం ఉన్న అమ్మాయిగా నటించి మెప్పించింది. ఈ సినిమా తర్వాత సంధ్యకు చాలా అవకాశాలు వచ్చాయి. ఆ తర్వాత వివిధ భాషల్లో దాదాపు 40కి పైగా సినిమాలు చేసింది.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు చెల్లెలుగా అన్నవరం సినిమాలో నటించింది సంధ్య. పవన్ చెల్లెలుగా, అమాయక పల్లెటూరి పిల్లగా ఆమె మెప్పించింది. ఆ తర్వాత వచ్చిన సినిమాలు అంతగా ఆడకపోవడంతో మెల్ల మెల్లగా ఇండస్ట్రీ నుంచి వెళ్లిపోయింది సంధ్య. ఇక తర్వాత లైఫ్ స్థిరపడిపోయింది. చెన్నైలోని ఒక సాఫ్ట్ వేర్ ఇంజినీర్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. వీరి వివాహం గురువాయుర్ దేవాలయంలో జరిగింది. ప్రస్తుతం ఆమె ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అప్పటి సంధ్య, ఇప్పటి సంధ్యకు చాలా తేడా ఉందని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. గుర్తు పట్టలేనంతగా మారిందని కామెంట్స్ పెడుతున్నారు.సంధ్య సోషల్ మీడియాలో కూడా చాలా వరకు కనిపించడం లేదు. 2016లో సంధ్యకు ఒక ఆడపిల్ల పుట్టింది. ఇక ఆమె తన భర్త, పిల్లలతో కలిసి చెన్నైలో స్థిరపడింది. ఇప్పటి వరకైతే ఆమె తన పర్సనల్ లైఫ్ ను పూర్తిగా ఎంజాయ్ చేస్తుంది. తను మళ్లీ సినిమాల్లోకి రావాలని ఈ మధ్య బాగా ట్రైచేస్తుందని తెలుస్తోంది.






