
Avoid heart disease : ప్రస్తుత కాలంలో గుండె జబ్బులు వెంటాడుతున్నాయి. గుండె జబ్బుల సమస్య పెరగడానికి మన అలవాట్లే కారణం. జీవన శైలిలో కూడా మార్పులు వచ్చాయి. ఇప్పుడు మనం ఆహార అలవాట్లను మార్చుకోవడం లేదు. జంక్ ఫుడ్స్ ను ఎక్కువగా ఇష్టపడుతున్నాం. బేకరి ఉత్పత్తులకు ఆర్షితులం అవుతున్నాం. దీంతో మన ఆరోగ్యం దెబ్బతింటుంది. గుండె ఆరోగ్యం పాడవుతోంది. రక్తంలో ట్రైగ్లిజరైడ్స్ ప్రభావం పెరుగుతోంది. గుండెపోటుకు కారణాలేంటో తెలుసుకుని దాని నుంచి బయటపడే మార్గాలు అన్వేషించుకోవాలి.
గుండెపోటు రావడానికి ప్రధాన కారణం అధిక రక్తపోటు. దీని వల్ల రక్తనాళాల్లో ప్రవహించే రక్తం ఒత్తిడి పడినప్పుడు గుండెపోటు రావడానికి అవకాశం ఉంది. అధిక రక్తపోటు సమస్యతో గుండె ఆరోగ్యంతో పాటు కిడ్నీలు, మెదడు, కాలేయం వంటి వాటికి కూడా ముప్పు ఏర్పడుతుంది. రక్తపోటుకు కారణమయ్యే ఆహారాలకు దూరంగా ఉండటమే శ్రేయస్కరం.
ఆధునిక జీవనశైలి కూడా గుండెపోటుకు ప్రధాన కారణమే. మారుతున్న జీవనశైలి కారణంగా కూడా గుండెపోటు ముప్పు వస్తుందని చెబుతున్నారు. ప్రతి రోజు రాత్రి భోజనం తరువాత కనీస 10 నిమిషాల లేదా 400 మీటర్లు నడిస్తే మంచి ఫలితం ఉంటుందని తెలుస్తోంది. ఇలా చేయడం వల్ల మనం తిన్న ఆహారం త్వరగా జీర్ణం అవుతుంది.
నూనె, ఉప్పు, చక్కెర, కొవ్వు ఎక్కువగా ఉన్న ఆహారాలు తినడం వల్ల కొలెస్ట్రాల్ పెరుగుతుంది. దీంతో గుండెపోటుకు కారణమవుతుంది. ఆహారం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. గుండెకు ముప్పు కలిగించే వాటి విషయంలో అప్రమత్తంగా ఉండాలి. లేకపోతే గుండె ఆరోగ్యం కాస్త దెబ్బతింటే ఇక ఆపరేషనే దిక్కవుతుంది. అయినా గ్యారంటీ ఉండదు.






