33.2 C
India
Monday, February 26, 2024
More

  YS Sharmila : వైఎస్ షర్మిలను దారికి తెచ్చుకోవడం ఎలా?

  Date:

  YS Sharmila
  YS Sharmila, CM Jagan

  YS Sharmila : వైఎస్ షర్మిల ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీలో చేరింది. ఇన్నాళ్లు తెలంగాణ వైఎస్ఆర్ పార్టీ పేరుతో రాజకీయాలు చేసినా ఫలితం కనిపించకపోవడంతో ఏపీ రాజకీయాల్లోనే ప్రత్యక్షంగా చేరాలని భావించింది. దీంతో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుంది. జగన్ లో చెల్లెలి భయం పట్టుకుంది. తాను చక్రం తిప్పాలంటే తన ప్రత్యర్థిగా చెల్లెలు ఉంటే సాధ్యమవుతుందా? అనే అనుమానం ఆయనలో వస్తోంది.

  దీంతో చెల్లెలిని ఎలా దారికి తెచ్చుకోవాలని ఆలోచనలో పడిపోయారు. ఆమె రాజకీయ అరంగేట్రాన్న అడ్డుకోవాలంటే ఏదో ఒకటి చేయాలనే ఉద్దేశంతో సజ్జలను ఉసిగొల్పారు. ఆయన చంద్రబాబు, పవన్ కల్యాణ్ లను టార్గెట్ చేస్తూ మమ్మల్ని ఒంటరిగా ఎదుర్కొనే శక్తి చాలక షర్మిలను తీసుకొచ్చారనే ఆరోపణ తీసుకొచ్చి వదిలేశారు. షర్మిలను కావాలనే ఏపీ రాజకీయాల్లోకి తీసుకొచ్చారనే విమర్శ సజ్జల ద్వారా చెప్పించారు.

  సజ్జల వాదనను నమ్ముతారా? చంద్రబాబు, పవన్ కల్యాణ్ లను లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేస్తే అవి నిజం అవుతాయా? వీరి ఊకదంపుడు ఉపన్యాసాలకు అంత విలువ ఉంటుందా? ఏదో వారి ఉనికి చాటుకునేందుకు ఈ ఆరోపణలు పనికి వస్తాయి తప్ప శాశ్వత పరిష్కారం మాత్రం కాదు. దీంతో ఏం చేయాలనే అంతర్మథనం పార్టీ నేతల్లో కనిపిస్తోంది. షర్మిలను ఎలా ఎదుర్కోవాలనే తర్జనభర్జనలో పడిపోయారు.

  కొంత కాలం వరకు ఆమె విషయంలో స్పష్టమైన నిర్ణయం వచ్చే వరకు ఇలాంటి మాటలతోనే కాలక్షేపం చేసేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. షర్మిలను పార్టీలోకి తీసుకుంటే తప్ప మరో గత్యంతరం లేదనే వాదనలు కొందరు తీసుకొస్తున్నట్లు సమాచారం. షర్మిలను వైసీపీలో చేర్చుకుంటే అంతా ప్లస్ అవుతుందని భావిస్తున్నారు. దీని కోసమే ఆమెకు వెల్ కమ్ చెప్పాలని చూస్తున్నట్లు తెలుస్తోంది.

  Share post:

  More like this
  Related

  India-Pakistan : పాక్‌కు నీళ్లు బంద్‌.. రావి జలాలన్నీ ఇక మనకే..!

  India-Pakistan : సింధూ ఉప నది రావి జలాలన్నీ ఇక మనమే...

  Team India : ఆ ఇద్దరే కాపాడారు! టీమిండియా సూపర్ విక్టరీ..

  Team India : రాంచీ వేదికగా జరిగిన నాలుగో టెస్ట్ లో ఇండియా...

  Nagabhushanam : నాగభూషణం ఫస్ట్ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?

  Nagabhushanam : 90's వారికి పెద్దగా పరిచయం లేకున్నా 80's వారికి...

  POLLS

  ప్రతిపక్షాలను ఇబ్బంది పెట్టటానికే 2000 రూపాయల నోటు రద్దు చేశారని మీరు భావిస్తున్నారా..?

  Latest News

  - Download the UBlood app here -

  Photos

  - Advertisement -

  Popular

  More like this
  Related

  CM Jagan : జగన్ కు మరో హెలీకాప్టర్, నెలకు రూ.2 కోట్లు అద్దె?

  CM Jagan : రాష్ట్ర ఇంటెలిజెన్స్ అండ్ సెక్యూరిటీ విభాగానికి ముఖ్యమంత్రి...

  Sharmila Arrest : షర్మిల అరెస్ట్.. ఉండవల్లిలో ఉద్రిక్తత..

  Sharmila Arrest : అమరావతి: ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలను...

  Sharmila Mass Warning : నన్నే అరెస్ట్ చేపిస్తావా.. జగన్ నీ అంతు చూస్తా.. షర్మిల మాస్ వార్నింగ్

  Sharmila Mass Warning : గుంటూరు: నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు ఇ వ్వాలని...

  Nara Lokesh : జగన్ తన ప్రసంగంలో ‘నాయుడు’ అని ఎన్నిసార్లు ప్రస్తావించారో తెలుసా? నారా లోకేశ్ ఆసక్తి కర ట్వీట్..

  Nara Lokesh : ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారంను...