Mobile Phones : ఫేమస్ సిటీలో చోర్ బజార్ ఉంటుంది కదా ఇందులో అమ్మే ఎక్కువ వస్తువులు దాదాపుగా దొంగతనం చేసిన పట్టుకచ్చినవే ఉంటాయి. ఇది అందరికీ తెలిసిందే.. అందుకే దాని పేరు కూడా చోర్ బజార్. కానీ షాపులు గురించి మాట్లాడితే.. అక్కడ అన్నీ కొత్తవే కదా..? అంటే కొన్ని షాపులో ఇది అనుమానమే.
సెల్ ఫోన్ అనేది ప్రస్తుత రోజుల్లో శరీరంలో ఒక పార్ట్ లా మారిపోయింది. హార్ట్, లంగ్స్, కిడ్నీలు లేకుండా బాడీ పని చేయదు కదా.. అలాగే సెల్ ఫోన్ లేకుంటే రోజు కాదు కాదు.. నిమిషం కూడా గడవదు. అంతలా మారిపోయింది. ప్రతీ అవసరం దానితోనే ముడిపడిపోయింది. వీటికి ఉన్న డిమాండ్ తెలుసుకున్న మొబైల్ షాపుల నిర్వాహకులు.. దొంగతలతో చేతులు కలిపి దొంగలించిన ఫోన్లకు సదరు కంపెనీ రేటుకు షాపులో పెట్టి దర్జాగా అమ్ముతున్నారు.
చోర్ బజార్ లో అయితే దొంగలించిన ఫోన్ కాస్ట్ చాలా తక్కువగా ఉంటుంది. అదే మొబైల్ షాపులలో అయితే ఆర్ఎంపీకి విక్రయించవచ్చు. బాగా డబ్బు వస్తుంది. ఇది దొంగ, షాపు నిర్వాహకులు కలిసి పంచుకుంటారు. కానీ ఆ ఫోన్ పై ఏదైనా కేసు ఉంటే మాత్రం పోలీస్ స్టేషన్, కోర్టుల చుట్టూ తిరగాలి. ఇది వినియోగదారుడి జీవితాన్నే నాశనం చేస్తుంది. ఒక కిటుకు పాటిస్తే ఇది దొంగలించిన ఫోనా.. లేదంటే కొత్తదా అనేది తెలుస్తుంది. అదెలాగంటే..
జన్యున్, సెకెండ్ హ్యాండ్ ఫోన్ ను ఎలా కనుక్కోవాలి.
*డయల్ ప్యాడ్ ఓపెన్ చేసుకొని *#06# ఎంటర్ చేయాలి. అప్పుడు ఆ ఫోన్ కు సంబంధించి ఈఎంఈఐ (EMEI) నెంబర్ వస్తుంది.
*ఈ నెంబర్ ను మనం రాసిపెట్టుకోవాలి.
*గూగుల్ ఓపన్ చేసి imei.info అని సెర్చ్ చేయాలి.
*వచ్చిన వెబ్ సైట్ లో ఈఎంఈఐ నెంబర్ ఎంటర్ చేయాలి.
*చెక్ ను క్లిక్ చేయగానే ఫోన్ పూర్తి సమాచారం వస్తుంది.
*కింద ఫోన్ బ్లాక్ లిస్ట్ చెక్ ప్రో క్లిక్ చేయాలి.
*కొంత అమౌంట్ అడుగుతుంది. అదిపే చేయగానే ఆ ఫోన్ జన్యునేనా సెకెండ్ హ్యాండా, దానిపై ఏమైనా కేసులు ఉన్నాయా? చూపిస్తుంది.
ఫోన్ ను పోగొట్టుకున్న వారు పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఈఎంఈఐ నెంబర్ తో కంప్లయింట్ ఇస్తే పోలీసులు ఆ నెంబర్ ను బ్లాక్ లిస్ట్ లో పెడతారు. అలా జరిగితే ఇందులో బ్లాక్ లిస్టెడ్ అని చూపిస్తుంది. ఇలా సెల్ ఫోన్ కొనే సమయంలో జాగ్రత్తలు పాటించాలి.