
children eye health : పిల్లలు ఇటీవల కాలంలో స్మార్ట్ ఫోన్లకు అలవాటు పడుతున్నారు. దీంతో కళ్లకు సంబంధించిన జబ్బులు వస్తున్నాయి. ఫోన్లు, టీవులు, ల్యాప్ టాప్ లు, ఐ ప్యాడ్ లు తదితర వాటివల్ల పిల్లలకు అనేక రకాల ఇబ్బందులు వస్తున్నాయి. అయినా లెక్క చేయడం లేదు. చాలా మంది పిల్లలు కళ్లకు సంబంధించిన సమస్యలు ఏర్పడుతున్నా పట్టించుకోవడం లేదు.
పిల్లల ఆహారం పట్ల కూడా శ్రద్ధ తీసుకోవడం లేదు. ఫలితంగా పలు రకాల వ్యాధులకు కేంద్రంగా నిలుస్తున్నారు. పిల్లలు ఎక్కువ సేపు స్క్రీన్లు చూడటం వల్ల కళ్లకు సమస్యలు వస్తున్నాయి. అయినా గంటల తరబడి ఫోన్లు వాడుతూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో పిల్లల ఆరోగ్యంపై ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
పిల్లల ఆహారంలో విటమిన్లు ఎ,సి,ఇ, జింక్, యాంటీ ఆక్సిడెంట్లు వంటి పోషకాలు ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి. చేపల్లో ఉండే ఒమేగా 3 ఫ్యాట్ కొవ్వు ఆమ్లాలు మనకు కంటికి సంబంధించిన పోషకాలు లభిస్తాయి. బిడ్డలకు తరచుగా తలనొప్పి అనిపిస్తే వెంటనే డాక్టర్ ను కలవడం ముఖ్యం. పిల్లలు చదవడానికి లేదా చూడటానికి ఇబ్బంది పడితే కంటి వైద్యుడిని సంప్రదించడం మంచిది.
కంటిచూపును మెరుగుపరుచుకునే ఆహారాల్లో క్యారెట్, బ్రోక్ లీ, బచ్చలికూర, స్ర్టాబెర్రీ, చిలగడ దుంపలు ఉండేలా చూసుకోవాలి. లేకపోతే కళ్లకు సంబంధించిన సమస్యలు పెరుగుతాయి. దీంతో కంటి జబ్బులు రావచ్చు. ఈనేపథ్యంలో కంటి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి చర్యలు తీసుకోవాల్సిందే.