
Bladder Diseases in Women : మహిళల్లో మూత్ర కోశ సమస్యలు వస్తుంటాయి. ఎందుకంటే వారు మంచినీళ్లు తక్కువగా తాగుతారు. ఇంటి వద్ద ఉండే వారికి ఇబ్బంది లేదు కానీ ఉద్యోగం చేసే వారు వివిధ పనులకు వెళ్లే వారు తరచూ మూత్రానికి వెళ్లాల్సి వస్తుందని నీళ్లు తక్కువగా తాగుతుంటారు. దీని వల్ల వారిలో మూత్రకోశ సమస్యలు ఏర్పడటం సహజం. కానీ చికిత్స తీసుకుంటే ఎలాంటి సమస్య అయినా దూరం కావడం ఖాయం.
మూత్ర కోశ సమస్యలు (Bladder Diseases) రాకుండా ఉండాలంటే మనం తినే తిండిలో కూడా మార్పులు చేసుకోవాలి. తాజా కూరగాయలు, పండ్లు, ఆకుకూరలు ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. అప్పుడే మూత్ర సంబంధమైన వ్యాధులు రావు. మూత్ర కోశ వ్యాధులు రాకుండా చేసుకోవడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకుంటే సరి. లేకపోతే సమస్య అలాగే ఉండిపోతుంది.
విటమిన్ సి మాత్రలు వేసుకోవడం ద్వారా కూడా మూత్ర కోశ వ్యాధులను నివారించుకోవచ్చు. వెల్లుల్లి కూడా మేలు చేస్తుంది. ఇందులో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలు ఉంటాయి. దీంతో మూత్రకోశ వ్యాధుల నుంచి ఉపశమనం కలిగిస్తాయి. దీనిలోని అలిసిన్ రసాయనం ఇ కొలితో తలెత్తే మూత్రకోశ ఇన్ఫెక్షన్లను తగ్గిస్తుంది.
మహిళల్లో వస్తున్న మూత్రకోశ వ్యాధులను నయం చేసుకోకపోతే సమస్య పెద్దదవుతుంది. ఇలా మహిళలు మంచినీరు తక్కువగా తాగడం వల్ల మూత్రకోశ సమస్యలు ఏర్పడుతున్నాయి. వాటిని తగ్గించుకోవడానికి తగినంత నీరు తాగాల్సిందే. దీని వల్ల మూత్ర సంబందమైన సమస్యలు లేకుండా పోతాయి. దీనికి మహిళలు చొరవ తీసుకుంటే సరిపోతుంది.