Meals : మనిషి తన జీవితంలో ఆహారం తీసుకోకపోతే బతకడం కష్టం. చిక్కి శల్యమైపోయి మరణం సంభవిస్తుంది. అందుకే మనిషి ప్రాణాలు నిలబెట్టుకోవడానకి ఆహారం తీసుకోవాలి. అది మూడు పూటలు తింటుంటారు. ఉదయం అల్పాహారంగా తింటాం. మధ్యాహ్నం భోజనం, సాయంత్రం డిన్నర్. ఇలా రోజుకు మూడు సార్లు తింటేనే మనిషి ప్రాణాలు ఉంటాయి. లేదంటే పోతాయి. అందుకే మన శరీరం నిలబడటానికి మనం ఆహారం తీసుకోవాల్సిందే.
ఒంటరిగా తినే భోజనం లెక్కకు రాదు. ఇద్దరు కలిసి తింటే భుక్తి అంటారు. ముగ్గురు కలిసి తింటే భోజ్యం అని పిలుస్తారు. ఇక నలుగురు కలిసి తింటే దాన్ని భోజనము అంటాం. ఇంటి యజమాని కుటుంబ సభ్యులందరితో కలిసి భోజనం చేయడం మంచిది. ఇలా చేయడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి. అందరు సంతోషంగా ఉంటారు. ఒకరి సాదకబాదకాలు మరొకరు చెప్పుకోవచ్చు.
ఎప్పుడు కూడా భార్యాభర్తలు కలిసి భుజించరాదు. ఎందుకంటే భార్య భర్తకు వడ్డించాలి. భర్త తిన్నాకే భార్య తినాలి. ఇది సనాతన సంప్రదాయం. తినేటప్పుడు మంచినీళ్ల గ్లాసు కుడివైపున ఉంచుకోవడం సురక్షితం. భోజనం చేసేటప్పుడు పీట మీద కూర్చుండే వారు కాలు కింద ఆనకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. కాలు కింద తాకితే ఆహారం భూమికి అందుతుంది.
భోజనం చేసే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. లేదంటే మనం తిన్న ఆహారం మన శరీరానికి ఇమడదు. ఏదో పరధ్యానంలో ఉండి తింటే అది మన శరీరానికి జీర్ణం కాదు. అందుకే భోజనం చేసేటప్పుడు మనసు, బుద్ధి అన్ని నియంత్రణలో ఉంచుకోవాలి. భోజనం మీదే ఫోకస్ ఉండాలి. టీవీ చూస్తూ తింటే కూడా అది మనకు అరగదు. ఇలా భోజనం చేసే సమయంలో మనం పాటించాల్సిన నిబంధనలు.