
Ustad Bhagatsingh : ప్రస్తుతం పవన్ కళ్యాణ్ చేస్తు్న్న సినిమాల్లో ఆడియన్స్ ఆతృతగా ఎదురుచూస్తున్నది ‘ఉస్తాద్ భగత్‌సింగ్’. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదటి షెడ్యూల్ ఇటీవలే పూర్తయింది. #OG తర్వాత రెండో షెడ్యూల్ ప్రారంభించే నేపథ్యంలో పార్టీ కార్యక్రమాలపై పడ్డారు పవన్ కళ్యాణ్. తన ఎన్నికల ప్రచార వాహనం ‘వారాహి’తో తూర్పు గోదావరి జిల్లాల్లో పర్యటించనున్నారు. అందుకే రెండో షెడ్యూల్ షూటింగ్ కు ఇంకా కాస్త సమయం పట్టేలా ఉంది. ఈ చిత్రానికి సంబంధించి ఫస్ట్ షెడ్యూల్ కు సంబంధించిన గ్లిప్స్ ఇటీవల విడుదల చేశారు మేకర్స్ భారీ వ్యూవ్స్ తో రికార్డులు బ్రేక్ చేసింది.
గ్లి్ప్స్ చూడగానే ఫ్యాన్స్ లో హిట్ కన్ఫమ్ అన్న ఫీలింగ్ కలిగింది. పవన్ కళ్యాణ్ రేంజ్ వింటేజ్ మాస్, స్వాగ్ ను చూపిస్తూ దర్శకుడు హరీశ్ శంకర్ సినిమాను ఆడుకున్నాడు అనిపిస్తుంది. కేవలం పది రోజుల షూటింగ్ లోనే ఇంత స్టఫ్ డైలాగ్స్ తో నిండిన గ్లప్స్ ఉంటే ఇక పూర్తి సినిమా ఏ రేంజ్ లో ఉంటుందో ఊహించుకోవచ్చని అంటున్నారు ఫ్యాన్స్.
ఈ సినిమాకు సంబంధించి సెకండ్ షెడ్యూల్ షూటింగ్ కోసం మేకర్స్ వేగంగా పనులు చేపడుతున్నారు. నేడు (జూన్ 6) హైదరాబాద్ లో ఒక భారీ సెట్ ఏర్పాటు చేస్తున్నట్టుగా మూవీ టీం ఒక వీడియోన్ ను ట్విటర్ ద్వారా షేర్ చేసింది. ఈ సెట్స్ ను పరిశీలిస్తే ఏదో కాలేజ్ అన్నట్లుగా ఉంది. ఇక్కడ ఇంటర్వెల్ ను తెరకెక్కిస్తారని లీకులు వినిపిస్తున్నాయి.
ఈ ఫైట్ కు ముందు పవన్ కళ్యాణ్ మార్క్ భారీ డైలాగ్స్, రిస్కీ స్టంట్స్ ఉన్న ఫైట్స్ ఉంటాయట. పవన్ కళ్యాణ్ కెరీర్ లోనే ఈ ఇంటర్వెల్ సీన్ ది బెస్ట్ గా నిలిచిపోయేలా ప్లాన్ చేస్తున్నాడు హరీశ్ శంకర్. హీరోయిన్ గా శ్రీలీల నటిస్తుండగా, దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఈ ఏడాదిలోగా షూటింగ్ పూర్తి చేసి సంక్రాంతి-2024కు విడుదల చేసే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది.






