
నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన వీరసింహా రెడ్డి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో నిన్న రాత్రి స్ట్రీమింగ్ కు వచ్చిన విషయం తెలిసిందే. అలా OTT లోకి రావడమే ఆలస్యం ఇలా దుమ్మురేపుతూ దూసుకుపోతోంది. మరో విశేషం ఏంటంటే ……. వీరసింహా రెడ్డి చిత్రం కేవలం తెలుగులో మాత్రమే కాదు హిందీ , కన్నడ , మలయాళ , తమిళ భాషల్లో కూడా విడుదల అయ్యింది. అవును డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో తెలుగు , తమిళ్ , మలయాళం , కన్నడ , హిందీ భాషల్లో విడుదల చేసారు డిస్నీ ప్లస్ హాట్ స్టార్ వాళ్ళు.
అన్ని భాషల్లో కూడా దుమ్మురేపుతూ దూసుకుపోతోంది వీరసింహారెడ్డి. భారీ యాక్షన్ సీన్స్ , సూపర్ హిట్ సాంగ్స్ అన్నింటికీ మించి బాలయ్య , వరలక్ష్మీ శరత్ కుమార్ , హానీ రోజ్ అభినయం , శృతి హాసన్ అందాలు ఈ సినిమాను మరో లెవల్ లో నిలబెట్టాయి. ఈ సినిమాలో నటించిన నటీనటులు అందరూ అన్ని భాషల వాళ్లకు తెలిసిన వాళ్ళు కావడం వల్ల కూడా వ్యూస్ పెరగడానికి కారణం.
గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం సంక్రాంతి బరిలో విడుదలై ప్రభంజనం సృష్టించింది. 150 కోట్ల భారీ వసూళ్లను సాధించింది వీరసింహారెడ్డి. ఇక బాలయ్య తాజాగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో NBK108 చిత్రం చేస్తున్న విషయం తెలిసిందే. ఆ సినిమా ఈనెలలో మళ్ళీ సెట్స్ మీదకు వెళ్లాల్సి ఉండేది. అయితే నందమూరి తారకరత్న అకాల మరణంతో బాలయ్య దుఃఖసాగరంలో మునిగారు. దాంతో సినిమా ఆలస్యంగా సెట్స్ మీదకు వెళుతోంది. మార్చి 12 నుండి బాలయ్య అనిల్ రావిపూడి సినిమా కొత్త షెడ్యూల్ ప్రారంభం కానుందని సమాచారం.