Miracle Meat:
మనుషులలో శాఖాహారులు, మాంసాహారులు అని ఉంటారు.
శాఖాహారుల దగ్గర మాంసాహారం గురించి మాట్లాడితేనే ఇబ్బంది గా ఫీల్ అవుతారు. అదే మాంసాహారులు మాత్రం మాంసం తినడం చాలా ఇష్టంగా ఫీల్ అవుతారు. కానీ వీరిలో చాలా మంది సాధారణంగా కోడి, మేక, ఆవు , చేప మాంసంను తింటారు. కానీ మనిషి మాంసం అంటే మాత్రం ఖచ్చితంగా అసహ్యించుకుంటారు. ఎందుకంటే ఇలా తినేవారు చాలా అరుదుగా ఉంటారు. అయితే దీని కోసం అతి తక్కువ ఖర్చుతో తయారుచేసేందుకు ఓ సంస్ధ ముందుకొచ్చింది.
యూకే కి చెందిన గుడ్ హార్వెస్ట్ అనే పేరు గల ఆహార ఉత్పత్తి కంపెనీ ప్రయోగశాలలో మనిషి మాంసాన్ని తయారుచేసే పనిలో ఉంది. దీనికోసం దాతల వద్ద కొంత మాంసాన్ని తీసుకుని వారికి కొద్ది మొత్తంను చెల్లిస్తుంది. దీన్ని ప్రయోగశాలలో పెద్ద మాంసపు ముద్దలుగా మారుస్తుంది. వీటిని ప్యాకింగ్ చేసి మార్కెట్ లో తక్కువ ధరకే అందుబాటులోకి తేవాలని చూస్తుంది. లండన్ లో ఓ రెస్టారెంట్ నిర్వాహకులు వెరైటీ గా మనిషి మాంసాన్ని రుచికరంగా వండి కస్టమర్లకు వడ్డించారు అనే వార్త భయం కలిగించే విధంగా ఉందని మాంసాహారులు అంటున్నారు.
‘ఛానెల్ 4’ లో మనిషి మాంసానికి సంబంధించి ‘ది బ్రిటిష్ మిరాకిల్ మీట్’ అనే కార్యక్రమం ప్రసారమైంది. దీనిపై చాలా మంది ఆందోళన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మాట్లాడిన గ్రెగ్ వ్యాలెస్ ప్రజలంతా సరిగా అర్ధం చేసుకోలేకపోతున్నారని అన్నాడు. గుడ్ హార్వెస్ట్ కంపెనీ టోడ్లర్ టార్టెర్ పేరుతో చిన్న పిల్లల నుంచి సేకరించి మాంసంను తయారుచేస్తున్నామని తెలిపింది. మాంసం ఇచ్చిన డోనర్ లకు 250 డాలర్లు చెల్లిస్తున్నామని చెప్పింది.