కరోనా కష్టకాలంలో గొప్ప మానవతావాదిగా నిలిచాడు సోనూ సూద్ . దాంతో ప్రఖ్యాత NDTV ” Humanitarian of the year ” అవార్డ్ తో సోనూ సూద్ ను సత్కరించింది. ఈ కార్యక్రమం దేశ రాజధాని ఢిల్లీలో జరిగింది. ఈ అవార్డ్ అందుకున్న సందర్భంగా సోనూ సూద్ మాట్లాడుతూ” తెలుగు , తమిళ , మలయాళ , హిందీ భాషల్లో పలు చిత్రాల్లో నటించానని అయితే అవి ఆయా దర్శకులు ఇచ్చిన పాత్రలను చేశానని ……. 100 కోట్లు , 500 కోట్ల వసూళ్ల చిత్రాల్లో నటించినా రాని సంతృప్తి కోవిడ్ సమయంలో చేసిన సేవకు లభించిందన్నారు. మానవతా దృక్పథంతో ఆపదలో ఉన్నవాళ్లకు సేవ చేస్తే…… వాళ్ళ ముఖంలో కనిపించే చిరునవ్వు నాకు చాలా చాలా సంతృప్తినిచ్చిందన్నారు.
సోనూ సూద్ అన్ని భాషా చిత్రాల్లో నటించాడు. అయితే ఎక్కువగా విలన్ పాత్రల్లోనే నటించాడు. తెరమీద విలన్ కానీ రియల్ లైఫ్ లో నిజమైన హీరో. కోట్లాది పారితోషకం తీసుకునే హీరోలు , అభిమానులు లక్షలాదిగా ఉన్న హీరోలు భారత్ లో చాలామంది ఉన్నారు. కానీ అలాంటి వాళ్ళు ఎవరూ చేయని సాహసం సోనూ సూద్ చేసాడు. కరోనా కష్టకాలంలో ఆపదలో ఉన్నవాళ్లను తక్షణం ఆదుకోవాలని భావించి తన హోటల్ లో విడిది ఏర్పాటు చేశాడు. అలాగే వేలాది మందిని తన సొంత ఖర్చులతో సొంత గ్రామాలకు బస్సుల ద్వారా , ట్రైన్ ల ద్వారా పంపించాడు. వలస కార్మికులకు దేవుడు గా నిలిచాడు. అంతేకాదు విదేశాల్లో ఉన్న స్టూడెంట్స్ ను కూడా సొంత ఖర్చులతో స్పెషల్ ఫ్లయిట్ లను ఏర్పాటు చేసి ఇండియాకు రప్పించాడు. పెద్ద ఎత్తున ఆక్సిజన్ లను ఏర్పాటు చేశాడు. ఇలా చెప్పుకుంటూ పోతే పెద్ద లిస్టు ఉంది. సంపాదించిన కోట్లాది డబ్బు మనం పోయినప్పుడు పట్టుకుపోయేది లేదని …… దాన్ని ఇక్కడే సద్వినియోగం చేయాలనే సంకల్పంతో మానవతా దృక్పథంతోనే చేసాడు సోనూ సూద్.
అందుకే ఇలాంటి బంగారాన్ని ఏరికోరి UBlood app కు బ్రాండ్ అంబాసిడర్ గా పెట్టుకున్నారు డాక్టర్ జై యలమంచిలి. రక్తదాతల కోసం , రక్త గ్రహీతల కోసం సమగ్ర సమాచారం ఉండే యాప్ గా UBlood app ను సృష్టించాడు డాక్టర్ జై యలమంచిలి. ఆ యాప్ కు సోనూ సూద్ బ్రాండ్ అంబాసిడర్ అనే విషయం తెలిసిందే. బంగారం లాంటి మనసున్న సోనూ సూద్ కు ప్రఖ్యాత NDTV ” Humanitarian of the year ” అవార్డ్ తో సత్కరించటం పట్ల తన ఆనందాన్ని వ్యక్తం చేశారు డాక్టర్ జై యలమంచిలి.