కాపురం చేసే కళ కాలు తొక్కే నాడే తెలుస్తుందంటారు. కొందరు పెద్దలు కుదిర్చిన పెళ్లిళ్లు చేసుకుంటుంటే మరికొందరు మాత్రం ప్రేమ వివాహాలు చేసుకుంటున్నారు. ఎవరికి నచ్చిన వారిని వారు చేసుకోవడం సహజం. ఈ నేపథ్యంలో పెళ్లిళ్లు స్వర్గంలో జరుగుతాయని అంటుంటారు. ప్రేమ వివాహాల్లో ఒకరిపై మరొకరికి అవగాహన ఉంటుంది. పెద్దలు చేసిన వివాహాల్లో ఒకరి గురించి మరొకరికి తెలియదు. దీంతో వారి మధ్య ప్రేమ పెరగాలంటే కొంత కాలం ఆగాల్సిందే.
భర్త మీద భార్యకు ప్రేమ ఉందో లేదో తెలుసుకోవాలంటే మనం చేసే ప్రతి పనిలో శ్రద్ధ తీసుకుంటుంది. సలహాలు, సూచనలు ఇస్తుంది. మన వెన్నంటే ఉండి సాయం చేస్తుంది. ఎలాంటి రహస్యాలు ఉంచుకోకుండా అన్ని విషయాల్లో భర్తను అనుసరిస్తుంది. దాపరికాలు లేకుండా మనతో నిత్యం సంతోషంగా ఉండేందుకు ప్రయత్నిస్తుంది. దీంతో భార్యాభర్తల్లో మరింత ప్రేమ పెరుగుతుంది.
మీ కళ్లలోకి చూస్తూ ఈ లోకాన్ని మరచిపోతుంది. మీరే సర్వస్వం అని చెబుతుంది. మిమ్మల్ని ఆకర్షించడానికి ప్రయత్నిస్తుంది. ఎంత బిజీగా ఉన్న మీతో కలిసి ఉండటానికే ప్రాధాన్యం ఇస్తుంది. మీతో ఏకాంతంగా గడపాలని చూస్తుంది. ఇలా మీపై ఎంతో ప్రేమ వ్యక్తపరుస్తుంది. మిమ్మల్ని వెన్నంటే ఉంటుంది. మీ సంతోషంలో పాలుపంచుకుంటుంది.
భర్త ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకుంటుంది. చిన్నపాటి జ్వరం వచ్చినా కంగారు పడుతుంది. ఆస్పత్రికి వెళ్లేలా చేస్తుంది. మనం చేసే పనుల్లో మనల్ని అనుసరిస్తుంది. మనకు చేతనైన సాయం చేస్తుంది. మనం చేసే పని తెలియకపోయినా నేర్చుకుని మరీ తోడుగా నిలుస్తుంది. మనకు అన్ని విషయాల్లో అండగా నిలుస్తుంది. ఎప్పుడు మనకు సాయం చేయాలని ఆలోచిస్తుంటుంది.
Breaking News
భర్త మీద ప్రేమ ఉందో లేదో తెలుసుకోవడానికి ఈ విషయాలు పరిశీలిస్తే సరి