Hyderabad City :: తెలుగు రాష్ట్రాలను ఇప్పటికే రుతుపవనాలు తాకేశాయి. తొలకరి పలకరించింది. ఇన్నాళ్లూ విపరీతమైన ఉక్కపోత, వడగాలులతో అల్లాడిన జనం, ప్రస్తుతం పడుతున్న చిరుజల్లుల్లో తడిసి ముద్దవుతున్నది. రాష్ర్టవ్యాప్తంగా మోస్తరు వర్షాలు మొదలవడంతో వాతావరణం చల్లబడింది. అయితే వర్షాకాలమొస్తేనే హైదరాబాద్ వాసులు భయపడుతారు. ఎందుకంటే లోతట్టు ప్రాంతాల్లో నీరు నిలిచి భారీ ఎత్తున ట్రాఫిక్ జాం అవుతుంది. గంటల తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితి ఉంది. అయితే తాజాగా నగరవాసులకు జీహెచ్ ఎంసీ అలర్ట్ ప్రకటించింది.
వాన కాలం నేపథ్యంలో రానున్న 24 గంటల్లో రంగారెడ్డి, జీహెచ్ఎంసీ మీదుగా ఐసోలేటెడ్ ప్రదేశాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడే అవకాశముందని పేర్కొంది. దీంతో కొంత ప్రయాణాలను వాయిదా, అనుగుణంగా ప్లాన్ చేసుకుంటే మంచిదని జీహెచ్ఎంసీ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ చెబుతున్నది. హైదరాబాద్ లోతట్టు ప్రాంతాల్లో దీని ప్రభావం ఉంటుందని అంచనా వేస్తున్నది. అయితే పెద్ద సంఖ్యలో వాహనాలు రోడ్లపైకి వస్తే ట్రాఫిక్ జాం లాంటి సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంటుందని చెబుతున్నది. అందుకే రానున్న 24 గంటల్లో ప్రయాణాలను వాతావరణాన్ని బట్టి ప్లాన్ చేసుకోవాలని సూచిస్తున్నది.
అయితే వానకాలం నేపథ్యంలోరాష్ట్రా ప్రభుత్వం కూడా అనుగుణంగా చర్యలు తీసుకుంటున్నది. ఇప్పటికే నీరు నిల్వ ఉండకుండా నాళాల వద్ద పారిశుధ్య సిబ్బందితో పనులు చేయిస్తున్నది. ఎప్పటికప్పుడూ జీహెచ్ఎంసీ సిబ్బందిని అలర్ట్ చేస్తున్నది. మంత్రి కేటీఆర్ ఈ విషయంపై ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నారు. గతంలో జరిగిన పరిణామాలను దృష్టిలో ఉంచుకొని ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా డిజాస్టర్ రెస్పాన్స్ టీం ను కూడా అలర్ట్ చేసింది.
ReplyForward
|