Hyderabad Wrestler : దేశంలో ఏటికేడాది ధనవంతుల జాబితా పెరుగుతుందని కొన్ని నివేదికలు, సర్వే ఎజెన్సీలు చెప్తున్నాయి. దేశంలో నేడు ప్రతీ ఐదు రోజులకు ఒక కొత్త బిలియనీర్ పుడుతున్నాడని నివేధికలు చెప్తున్నాయి. ఇటీవల హురున్ అనే సంస్థ నిర్వహించిన సర్వేలో సంచలన విషయాలు బయటపడ్డాయి. దేశంలోని ధనవంతుల జాబితాలో మన హైదరాబాద్ కు చెందిన రెజ్లింగ్ ప్లేయర్ పొంగులేటి హర్ష ఉన్నాడని తెలిపింది. దీంతో క్రీడాలోకం ఆశ్చర్యానికి గురైంది. కేవలం 30 సంవత్సరాలు ఉన్న పొంగులేటి హర్ష నికర విలువ ₹1,300 కోట్లు హైదరాబాద్‌కు చెందిన అతి పిన్న వయస్కుడైన బిలియనీర్ గా హురున్ అభివర్ణించింది. దేశంలోని పిన్న వయస్సుల బిలియనీర్లలో హర్ష 6వ స్థానంలో ఉన్నాడు. దేశంలోని బిలియనీర్ల జాబితిలో 17 మందితో హైదరాబాద్ 3వ ప్లేస్ లో కొనసాగుతుందట. ఇక భారతదేశంలో 334 బిలియనీర్లు (గత సంవత్సరంతో పోలిస్తే 29% పెరుగుదల) ఉన్నారట. 2023లో ప్రతి 5 రోజులకు ఒక కొత్త బిలియనీర్ ఆవిర్భవిస్తున్నారట. ఇందులో తెలంగాణ పరిశీలిస్తే దేశంలో 5వ స్థానంలో ఉందట.
Breaking News