
మెగాస్టార్ చిరంజీవి నటించిన భోళా శంకర్ కోసం ఫ్యాన్స్ అంతా ఎదురు చూస్తున్న విషయం తెలిసిందే.. ఈ సినిమా మరో నాలుగు రోజుల్లో రిలీజ్ కానుంది. ఈ క్రమంలోనే నిన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా ఘనంగా జరిగింది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న హైదరాబాద్ లోని శిల్పకళా వేదికలో గ్రాండ్ గా నిర్వహించారు.. ఈ ఈవెంట్ లో ఎన్నో విషయాలు హైలెట్ గా నిలిచాయి..
ఇక హైపర్ ఆది స్పీచ్ కూడా ఆకట్టుకుంది. ముఖ్యంగా ఈయన మెగా ఫ్యామిలీని విమర్శించే వారికీ తన మాటలతో బుద్ధి చెప్పారు.. ఈయన మాట్లాడుతూ.. బేసిక్ గా హీరోలకు ఫ్యాన్స్ ఉంటారు.. కానీ ఆయనకు హీరోలే ఫ్యాన్స్.. ఆస్తులు సంపాదించడం కంటే అభిమానులను సంపాదించారు.. ప్రతీ ఇంట్లో ఫ్యాన్ ఉంటుందో లేదో తెలియదు కానీ మెగాస్టార్ ఫ్యాన్ మాత్రం ఉంటారు..
మెగాస్టార్ పై మాత్రమే కాదు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మీద కూడా తనదైన శైలిలో వ్యాఖ్యలు చేసి మెగా ఫ్యాన్స్ కు గూస్ బంప్స్ తెప్పించాడు. ”అన్నయ్య మంచోడు.. కాబట్టి ముంచేశారు.. కానీ తమ్ముడు అలా కాదమ్మా.. చాలా మొండోడు.. తాడోపేడో తేల్చుకుంటాడు.. అందరి లెక్కలు తేల్చాస్తాడు.. గట్టిగ ఇచ్చిపడేస్తాడు.. అంటూ పవన్ మీద తన అభిమానాన్ని చాటుకున్నాడు హైపర్ ఆది.
ఇక రామ్ చరణ్ గురించి సచిన్ కొడుకు సచిన్ కాలేదు.. అమితాబ్ కొడుకు అమితాబ్ కాలేదు.. కానీ చిరంజీవి కొడుకు చిరు అయ్యాడు.. కొణిదెల వెంకట్రావ్ కు చిరంజీవి ఎంత పేరు తెచ్చాడో.. అంతకంటే మరింత గొప్ప పేరును చిరంజీవికి రామ్ చరణ్ తెచ్చాడు.. అంటూ మెగా ఫ్యాన్స్ కు నచ్చేలా వారు మెచ్చేలా హైపర్ ఆది స్పీచ్ ఆద్యంతం గూస్ బంప్స్ వచ్చేలా సాగింది.
ReplyForward
|