
I am not Shah Rukh : బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ గురించి అందరికీ తెలిసిందే. ఇటీవలే కిసీకా బాయి కిసీకా జాన్ సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు. ఇప్పటికే టైగర్3సెట్స్ ఉంది. ఇమ్రాన్ హష్మీ కత్రినా కైఫ్ ఇందులో స్ర్కీన్ షేర్ చేసుకోనున్నారు. యష్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్ లో నిర్మిస్తున్న టైగర్ -3 ఈ ఏడాది దీపావళికి విడుదల కానుంది. అయితే ఇప్పటికీ వేదిక ఏదైనా సల్మాన్ అక్కడికి వస్తే ముందుగా వచ్చే ప్రశ్న మీ పెళ్లెప్పుడు అని. దానికి ఈ కండల వీరుడు కూడా అంతే చమత్కారంగా సమాధానమిస్తుంటాడు. వేదికలపై తన సరదా వ్యాఖ్యలతో నవ్వులు పూయిస్తుంటాడు. ఇలాంటి సంఘటనే ఐపా వేడుకలకు ఒక రోజు మరోసారి చోటు చేసుకుంది.
ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ అవార్డ్స్ (IIFA) మే 27న అబుదాబిలోని యాస్ ఐలాండ్‌లో నిర్వహించనున్నారు. ప్రధాన ఈవెంట్‌కు ఒక రోజు ముందు, IIFA రాక్స్ ఏర్పాటు చేశారు. దీనికి పలువురు ప్రముఖ సినీ ప్రముఖులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రముఖుల కోసం ప్రత్యేకంగా గ్రీన్ కార్పెట్‌ను ఏర్పాటు చేశారు. IIFA ప్రీ ఈవెంట్‌కు హాజరైన స్టార్లలో సల్మాన్ ఖాన్ కూడా ఉన్నారు. గ్రీన్ కార్పెట్‌పై హాలీవుడ్ కు చెందిన ఒకరు బాలీవుడ్ సూపర్‌స్టార్‌పై తన ప్రేమను కురిపించారు. నిన్ను చూసిన క్షణంలోనే నీతో ప్రేమలో పడ్డాను అని ఫారిన్ యువతి చెప్పారు.
దీనికి సల్లుభాయ్ సరదాగా స్పందించారు. “మీరు షారుఖ్ ఖాన్ గురించి మాట్లాడుతున్నారా అని ఎదురు ప్రశ్నించి అందరినీ ఆశ్చర్యపరిచారు. దీనికి ఆమె లేదు నేను సల్మాన్ ఖాన్ గురించి మాట్లాడుతున్నానని బదులిచ్చింది. నన్ను పెళ్లి చేసుకుంటారా అని ఆమె సల్మాన్ ను అడిగింది. దీనికి సల్మాన్ మరింత చమత్కారంగా స్పందించారు. ‘నేను పెళ్లి చేసుకునే రోజులు అయిపోయాయి.. 20 ఏళ్ల క్రితమే కలిసి ఉండాల్సింది అని చెప్పి అందరిలో నవ్వులు పూయించారు.