
Revanth Reddy : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోసారి తానే ముఖ్యమంత్రి అవుతానని ధీమా వ్యక్తం చేశారు. శాసనమండలి వాయిదా అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.
“మొదటిసారిగా ప్రజలు బీఆర్ఎస్ ప్రభుత్వంపై వ్యతిరేకతతో ఓటు వేశారు. కానీ, రెండోసారి మా ప్రభుత్వంపై నమ్మకంతో ఓటు వేస్తారు. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకునేందుకు శాయశక్తులా కృషి చేస్తాం. ఇచ్చిన ప్రతి హామీని అమలు చేసి ప్రజల వద్దకు వెళ్తాం. సంక్షేమ పథకాల లబ్ధిదారులే మా ఓటర్లు. నేను పనిని నమ్ముకొని ముందుకు వెళ్తున్నాను. ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకుంటాం. స్టేచర్ కాదు, స్టేట్ ఫ్యూచర్ నాకు ముఖ్యం. 25 లక్షల మందికి పైగా రైతులకు రుణమాఫీ జరిగింది. కోటి మంది మహిళలకు కచ్చితంగా లబ్ధి చేకూరుస్తాం. వారంతా ఇప్పుడు మాట్లాడకపోయినా ఓటు మాకే వేస్తారు. గతంలో నేను చెప్పింది జరిగింది, భవిష్యత్తులోనూ నేను చెప్పిందే జరుగుతుంది” అని రేవంత్ రెడ్డి అన్నారు.