Last selfie : చిన్న పొరపాట్లే జీవితంలో పెద్ద పెద్ద ప్రమాదాలకు దారి తీస్తాయి. అవి ఏ రూపంలో ఎలా వస్తాయో ఎవరికీ తెలియదు. అయితే చిన్న చిన్న పొరపాట్లే కదా అని నిర్లక్ష్యం చేస్తే అవి పెద్ద ముప్పును తెచ్చి పెడతాయి. జీవితంలో కోలుకోలేని దెబ్బ తీస్తాయి. అలాంటి చిన్న తప్పిదమే తన జీవితాన్ని అంధకారంలోకి నెట్టిందని తమిళనాడుకు చెందిన ఒక వ్యక్తి సోషల్ మీడియాలో తన గోడు వెల్లబోసుకున్నాడు.
ఒక రోజు సాయంత్రం 6 గంటలకు నేను నా భార్య బైక్ మీద వెళుతుండగా.. అన్నా నగర్ దగ్గర నా భార్య సడన్ గా స్పృహ తప్పి కింద పడిపోయింది. దగ్గరలో ఉన్న దవాఖానకు వెంటనే తీసుకెళ్లాను. చిన్న గాయమే అనుకుంటే డాక్టర్లు సిటీ స్కాన్ చేసి మెదడు ఎడమ వైపు భాగం దెబ్బతిందని బాగా ఉబ్బుతోందని చెప్పారు. ఇక బతకడం కష్టమే అని చెప్పారు. దీంతో ఆ ఆసుపత్రి నుంచి మరో హాస్పిటల్ కు చేర్చాను.
కాగా అక్కడి డాక్టర్లు సర్జరీ చేశారు. అయితే సర్జరీ అనంతరం తన భార్య మెదడు స్పందించడం క్రమ క్రమంగా తగ్గింది. అప్పుడు నా భార్య ఐదు నెలల గర్భవతి అని ఆ తర్వాత కోమాలోకి వెళ్లిపోయిందని చెప్పారు. అనంతరం ఐదు రోజుల తర్వాత నా కొడుకు ఈ లోకాన్ని కూడా చూడకుండా తన తల్లి కడుపులోనే మరణించాడని చెప్పాడు. ఆ తర్వాత తన భార్య బ్రెయిన్ డెడ్ అయిందని డాక్టర్లు చెప్పాడని తెలిపారు. అయితే ముందుగానే అవయవ దానం చేయాలని నిర్ణయించుకున్నాం. కాబట్టి ఆర్గాన్ డొనేషన్ ఫామ్ మీద సంతకం చేయగా.. జనవరి 13న తన భార్య చనిపోయిందని అతడు తెలిపాడు.
అవును ఇదంతా ఎందుకు చెబుతున్నారంటే.. బైక్ నడిపే సమయంలో నేను హెల్మెట్ పెట్టుకున్నాను. కానీ నా భార్య హెల్మెట్ పెట్టుకోలేదు. దీంతో చిన్న ప్రమాదమే కానీ తలకు గాయం కావడంతో నా భార్య కోమాలోకి వెళ్లిపోయింది. ఆ తర్వాత చనిపోయింది. కాబట్టి బైక్ నడిపే టప్పుడు మనమే కాకుండా మనతో ఉండే వాళ్లని రక్షించడం మన బాధ్యత అంటూ వాపోయాడు. కాగా తన భార్యతో ఇదే చివరి సెల్ఫీ కావొచ్చని అంటూ దిగిన ఫొటో సోషల్ మీడియాలో పెట్టగా తెగ వైరల్ గా మారింది. కాబట్టి బైక్ పై వెళ్లే సమయంలో ఇద్దరు కూడా హెల్మెట్ ధరించాలని ఆయన సూచించాడు.