30.9 C
India
Saturday, May 17, 2025
More

    Deputy CM Pawan Kalyan : జీతం తీసుకోబుద్ది కావడం లేదు.. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సంచలన కామెంట్స్

    Date:

    Deputy CM Pawan Kalyan
    Deputy CM Pawan Kalyan

    Deputy CM Pawan Kalyan : ఏపీలో కూటమి ప్రభుత్వం వచ్చి దాదాపు నెల రోజులు కావొస్తుంది. ఈ సందర్బంగా పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం సోమవారం చేపట్టింది. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కాకినాడ జిల్లా గొల్లప్రొలు లో జరిగిన కార్యక్రమంలో పింఛన్ల పంపిణీ ప్రారంభించారు. తన శాఖలపై అధ్యయనానికి కాస్త సమయం తీసుకుంటున్నా..  ఏ శాఖలో ఎన్ని అప్పులు ఉన్నాయో ఇంకా ఓ కొలిక్కి రావడం లేదు.

    రాష్ట్రం సంక్షేమంతో పాటు అభివృద్ధి పథంలో కూడా ముందుకు దూసుకుపోవాలి. కానీ ఎక్కడా కూడా వైసీపీ పాలనలో అభివృద్ధి చేసిన దాఖలాలు కనిపించడం లేదు. రుషికొండలో ప్యాలెస్ కట్టుకున్నారు. అవే నిధులను వివిధ శాఖలకు ఉపయోగిస్తే కొన్ని అవసరాలైన తీరేవి. పంచాయతీ రాజ్ శాఖలో ఎన్ని అప్పులు ఉన్నాయో తెలియడం లేదు. జీతం తీసుకోవాలన్ని మనసు ఒప్పుకోవడం లేదు. చుట్టు పక్కలా గోదావరి పారుతున్న తాగునీటికి ఇన్ని ఇబ్బందులు ఉండటం దురదృష్టకరం. ఒక్కో విభాగం గురించి మాట్లాడుకుంటే అన్ని అప్పులే కనిపిస్తున్నాయి. తవ్వే కొద్దీ అవినీతే బయటపడుతుంది.
    పిఠాపురం నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపించి దేశంలోనే మోడల్ గా నిలపాలని కోరుకుంటున్నారు. నైపుణ్య శిక్షణ కేంద్రాల ద్వారా యువతకు ఉపాధి మార్గాలను చూపించాలని అనుకుంటున్నాం. విదేశాలకు వెళ్లానుకునే వారికి శిక్షణ ఇవ్వాలి. డబ్బులు సంపాదించుకోవడం, కొత్తగా పేరు తెచ్చుకోవడం కోసం కాదు.. నాకు మంచి పనులు చేసి ప్రజల్లో సుస్థిర స్థానం సంపాదించడమే  లక్ష్యమని పవన్ కల్యాణ్ అన్నారు.
    క్యాంపు ఆఫీసులో మరమ్మతుల గురించి ప్రశ్నించగా.. ఇప్పుడు అవసరం లేదని చెప్పానని, అవసరమైతే సొంత నిధులతో ఫర్నీచర్ తెచ్చుకుంటానని చెప్పానని తెలిపాడు. మాకు ఓటేయకున్నా.. అర్హత ఉంటే అందరికీ పింఛన్లు ఇస్తామని చెబుతున్నాం. నన్ను గెలిపించిన పిఠాపురం ప్రజలకు జీవితాంతం రుణపడి ఉంటామని ఆయన అన్నారు.

    Share post:

    More like this
    Related

    IPL: ప్లే ఆఫ్స్ రేస్.. ఏ జట్టు ఎన్ని గెలవాలంటే!

    IPL 2025 : భారత్, పాక్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో వాయిదా పడిన...

    MS Dhoni : ఎంఎస్ ధోని రిటైర్మెంట్‌పై క్లారిటీ!

    MS Dhoni : ధోని ఐపీఎల్ నుంచి రిటైర్ అవుతారనే ఊహాగానాలకు...

    Mahesh Babu : మహేష్ బాబు కంటే ముందే రాజమౌళి మరొక హీరోతో సినిమా చేయాల్సిందా..? ఇంతకీ ఆ హీరో ఎవరంటే..?

    Mahesh Babu : దర్శక ధీరుడు రాజమౌళి తన తదుపరి పాన్ వరల్డ్...

    Amar Deep : నా లవర్ ని నా కళ్ళ ముందే… ఎట్టకేలకు ఆ రహస్యం బయటపెట్టిన బిగ్ బాస్ అమర్ దీప్!

    Amar Deep : బిగ్ బాస్ తెలుగు సీజన్ 7తో పాప్యులర్ అయిన...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Mark Shankar : మార్క్ శంకర్ కోలుకుంటున్నాడు.. అందరికీ థాంక్స్: పవన్ కళ్యాణ్

    Mark Shankar : తన కుమారుడు మార్క్ శంకర్ ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా...

    Pawan Kalyan : పవన్ చేసిన మంచినే ఆయన కుమారుడిని సింగపూర్ లో కాపాడిందా?

    Pawan Kalyan Son : ఆంధ్రప్రదేశ్‌లో భవన నిర్మాణ కార్మికుల సమస్యలను తన...

    Pawan Kalyan’s son : పవన్‌ కల్యాణ్‌ కుమారుడిపై లేటెస్ట్ హెల్త్ బులిటెన్ విడుదల..!

    Pawan Kalyan's son Health Update : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్...

    Pawan Kalyan : స్కూల్లో అగ్ని ప్రమాదం : చిక్కుకున్న పవన్ కల్యాణ్ చిన్న కుమారుడు

    Pawan Kalyan : ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్ తీవ్ర విషాదంలో...